ట్యాబ్లెట్ ప్యాకెట్లో చనిపోయిన దోమ ప్రత్యక్ష్యం..! - MicTv.in - Telugu News
mictv telugu

ట్యాబ్లెట్ ప్యాకెట్లో చనిపోయిన దోమ ప్రత్యక్ష్యం..!

October 24, 2019

Tablets .

తినే తిండి, పరిసరాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో అనారోగ్యపాలు అవుతుంటాం. కానీ అనారోగ్య పాలైతే వేసుకునే మందు బిళ్లల్లో కూడా నాణ్యత లోపిస్తోంది. సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో వెలుగులోకి వచ్చిన వార్తే ఇందుకు నిదర్శనం. పీహెచ్‌సీ వైద్యులు ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులో ఇచ్చిన ప్యారసిటమల్ ట్యాబ్లెట్‌లో ఏకంగా దోమ కనిపించి కలవరానికి గురి చేసింది. వెంటనే స్పందించిన వైద్య సిబ్బంది వాటిని వెనక్కి తీసుకొని వేరే వాటిని ఇచ్చి పంపించారు. 

గ్రామ ఆరోగ్య వేదికలో వైద్య సిబ్బంది హెల్త్ క్యాంప్ నిర్వహించారు.  లక్ష్మీనగర్‌కు చెందిన సీహెచ్‌ రాము అనే జ్వరానికి వైద్య పరీక్షలు చేయించుకోవడంతో వైద్యులు అతనికి కొన్ని మందులు ఇచ్చారు. ఇంటికి వెళ్లాక ట్యాబ్లెట్‌లను వేసుకుంటుండగా ప్యారసెటమాల్‌ ప్యాకింగ్‌లో మృతి చెందిన దోమ కనిపించింది. దీన్ని వారి దృష్టికి తీసుకురావడంతో ఉన్నతాధికారులకు దీనిపై ఫిర్యాదు చేస్తామని వారు వెల్లడించారు. ట్యాబ్లెట్ల ప్యాకింగ్‌లో నాణ్యత పాటించకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.