most claps guinnes record
mictv telugu

ఒక్క నిమిషంలో అన్ని చప్పట్లు కొట్టి గిన్నిస్ రికార్డు

November 5, 2022

మీరు ఒక నిమిషంలో ఎన్ని సార్లు చప్పట్లు కొడతారో ఒక సారి చెక్ చేసుకోండి. నిమిషంలో 1,140 కంటే ఎక్కువ చప్పట్లు కొడుతున్నారేమో కౌంట్ చేసుకోండి. అలా కొట్టారంటే గిన్నీస్ రికార్డు మీదే. తాజాగా ఆమెరికాకు చెందిన 20 ఏళ్ల డాల్టన్ మేయర్ చప్పట్లతో గిన్నీస్ రికార్డు సృష్టించాడు.

ఒక్క నిమిషంలో 1,140 సార్లు చప్పట్లు కొట్టి గిన్నిస్ బుక్ ఎక్కాడు. ఇంతకుముందు బిషప్ పేరిట ఒక నిమిషంలో 1,103 క్లాప్స్‎తో ఉన్న రికార్డును డాల్టన్ బ్రేక్ చేసాడు. అతను డెవలప్ చేసిన క్లాప్స్ నే ఉపయోగించి ఇంతలా వేగవంతంగా కొట్టగలిగానని చెప్పాడు. అతడు కొట్టిన చప్పట్ల సౌండ్‌ని ఇల్లినియాస్‌కు చెందిన చార్మ్ మీడియా గ్రూప్ ఫోటోగ్రఫీ పరికరాలతో రికార్డు చేసారు. ఐతే ఒక చేతి మణికట్టుని మరో చేతి వేళ్లతో ఆనించి చప్పట్లు కొట్టాలి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.