ప్రేమికులు, భార్యాభర్తలు….రిలేషన్ ఏదైనా గొడవలు మాత్రం కామన్. గొడవలు లేని చోట ప్రేమ లేదని కూడా అర్ధాలు కల్పించుకున్నారు. కానీ గొడవలు పుడుతున్న కొద్దీ ఆ బంధం బలహీనపడుతుందే తప్ప బాగుపడదు. మరి రిలేషన్స్ బాగుండాలంటే ఏం చేయాలి. ఏ రిలేషన్ అయినా అది అక్కాచెల్లీ అవ్వొచ్చు, అన్నాతమ్మడు అవ్వొచ్చు, భార్యాభర్త అవ్వొచ్చు….ఏదైనా సరే ముందు అవగాహన, అండర్స్టాండింగ్ ముఖ్యం. అది ఉంటే సగం సమస్యలు తీరిపోయినట్టే.
వాదించొద్దు:
ఎవరైనా ఇద్దరి మధ్య గొడవ జరిగిందంటే ముందు వాదన మొదలవుతుంది. సరిగ్గా అక్కడే పుల్ స్టాప్ పెట్టేస్తే ఆ గొడవ ముదరకుండా ఉంటుంది. ఏవరైనా సరే నేనే గెలవాలనుకోవడం మంచి విషయం కాదు. ముఖ్యంగా భార్యాభర్తలు చేసే మొదటి తప్పు అదే. ఒకవేళ మనమే కరెక్ట్ అయినా సరే ఆ సమయానికి తగ్గడమే మంచిది. తర్వాత కోసం, వేడి చల్లారక నెమ్మదిగా సర్దిచేప్పుకోవచ్చును. ఆవేశంలో ఉన్నప్పుడు మనిషి సెన్స్ పనిచేయదు, అప్పడు ఎంత చెప్పినా వాళ్ళ బుర్రలోకి ఎక్కదు. కాబట్టి వాదించి ప్రయోజనం ఉండదు.
మనమెవరం నిర్ణయించడానికి:
మనకి మనమీద తప్ప ఇంకెవరి మీద హక్కు ఉండదు. అది కడుపున పుట్టిన పిల్లలు అయినా , భార్యభర్త అయినా. కాబట్టి వాళ్ళ జీవితం మనం శాసించాలని అనుకోకూడదు. అలాగే హద్దులు పెట్టకూడదు కూడా. ముఖ్యంగా ప్రేమికులు, లివిన్, భార్యాభర్తల మధ్య ఇది అస్సలు ఉండకూడదు. పార్టనర్ ఇష్టాన్ని ఎప్పుడూ గౌరవించాలి. దానికి మనఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. అభిప్రాయం చెప్పడం వరకు ఓకే కానీ నిలువరించాలని చూడకూడదు.
పోల్చొద్దు:
ఎప్పుడు అవతలి వాళ్ళ ఒంకోళ్ళతో పోల్చకూడదు. అది ఎవ్వరికీ మంచిది కాదు. రిలేషన్స్ గ్యాప్ రావడానికి ఇదో పెద్ద కారణం అవుతుంది.
సోషల్ మీడియా:
ఇది మొత్తం మన జీవితాల్ని ఆక్రమించేస్తున్న భూతం. సోషల్ మీడియా మంచిదే కానీ అది మన రిలేషన్ కు చేటు చేసేదిగా ఉండకూడదు. పార్టనర్ పక్కన ఉన్నప్పుడు సోషల్ మీడియాను దూరంగా ఉంచడమే మంచిది.
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు:
రిలేషన్ లో ఒకరి తప్పులు మరొకరు వెతకడం అస్సలు మంచిది కాదు. వాటిని పెద్ద విషయంలా చూడడం అనేది తగాదాలకు కారణం అవుతుంది.అంతేకాదు పార్టనర్ చెప్తున్న విషయాన్ని శ్రద్ధగా వినకపోవడం కూడా మంచది కాదు. మనకు ఇంట్రస్ట్ లేని విషమైనా సరే అవతలి వాళ్ళ ఆసక్తులను పట్టించుకోవాలి.
ఇగో:
భార్యాభర్తల మధ్య జరిగే తగాదాలకు ప్రధాన కారణం ఇగో. నేనే ఎందుకు ముందు చేయాలి అనే సమస్య నుంచి తగాదాలు ప్రారంభం అవుతాయి.