ప్రభాస్‌ను వెనక్కి నెట్టిన విజయ్ దేవరకొండ.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభాస్‌ను వెనక్కి నెట్టిన విజయ్ దేవరకొండ..

May 17, 2019

Most Desirable Vijay Deverakonda Beats Prabhas.

తెలుగు సినిమాల్లోకి రాకెట్‌లా దూసుకొచ్చి చాలా తొందరగా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడీ యువ క్రేజీ స్టార్ ప్రతిష్ఠాత్మక టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ఇందులో టాలీవుడ్ నుంచి విజయ్‌కు  మాత్రమే స్థానం లభించింది. టైమ్స్ 2018కి గాను టాప్50 సెలబ్రిటీలతో మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితా విడుదల చేసింది. ఈ లిస్టులో విజయ్ దేవరకొండ నాలుగోస్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో బాలీవుడ్‌లో ఈమధ్య వరుస సినిమాలు చేస్తున్న విక్కీ కౌశల్ నిలిచాడు.  రెండవ స్థానంలో భారత ఫుట్‌బాల్ ప్లేయర్, మోడల్ ప్రథమేశ్ మౌలింకర్ నిలిచాడు. మూడో స్థానంలో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్, నాలుగో స్థానంలో విజయ్ దేవరకొండ నిలిచాడు. 


ఐదో స్థానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వున్నాడు. ఇక టాలీవుడ్ బాహుబలి ప్రభాస్‌కు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో 12వ ర్యాంక్ ఇచ్చారు. రానాకు 19వ ర్యాంక్ దక్కింది. 2017లో ప్రభాస్‌కు ఇదే జాబితాలో రెండవ ర్యాంక్‌లో వుండగా, రానా 7వ ర్యాంక్‌లో ఉన్నాడు.