most dificult mountain in pakistan nanga parbat
mictv telugu

ఈ కొండ ఎక్కడం పెద్ద సాహసమే.

December 28, 2022

most dificult mountain in pakistan nanga parbat

కొన్ని ప్రయాణాలు ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటాయో అంతే భయం కలిగిస్తాయి. ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన శిఖరాల్లో తొమ్మిదవ శిఖరంగా పేరున్న ‘నంగా పర్బత్‌’ పై జర్నీ కూడా అలాంటి అనుభవాన్నే ఇస్తుంది. పాకిస్తాన్‌లోని రెండవ ఎత్తయిన పర్వతం ఇది. ఆక్రమిత కాశ్మీరులోని గిల్గిట్‌ బాల్టిస్తాన్‌లో చిలాస్, అస్తోర్‌ ప్రాంతాల మధ్య ఉన్న ఈ శిఖరం ఎత్తు 26,660 అడుగులు. నంగా పర్బత్‌ అంటే ‘నగ్న పర్వతం’ అని అర్థం. 1953లో హెర్మన్‌ బుహ్ల్‌ అనే ఆస్ట్రియన్‌ జర్మన్ పర్వతారోహకుడు మొదటిసారి ఈ పర్వతాన్ని అధిరోహించాడు.

ఈ పర్వతం నిటారుగా ఉంటుంది. అందుకే దీన్ని ఎక్కడం చాలా కష్టం.20వ శతాబ్దం మొదట్లో ఈ పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నంలో అనేకమంది మరణించడంతో దీనికి ‘కిల్లర్‌ పర్వతం’ అనే పేరూ వచ్చింది. ఇది చాలా ఇరుకైన రహదారి కావడంతో దీని మీద ప్రయాణం చాలా ప్రమాదకరం. కారకోరం హైవే దగ్గర ఆరంభమయ్యే ఈ పర్వత మార్గం గుండా.. 10 మైళ్ల దూరంలో ప్రయాణిస్తే ఒక అందమైన పల్లెటూరు వస్తుంది. ఈ క్యాంప్‌ను మోస్ట్‌ డేంజరెస్‌ అండ్‌ థ్రిల్లింగ్‌ టూర్‌ అంటారు పర్వత పర్యాటక ప్రియులు.అయితే దీనికి నగ్న పర్వతం అనే పేరు ఎందుకు వచ్చిందో మాత్రం తెలియలేదు. అసలు దానికి పేరు ఎవరు పెట్టారో కూడా తెలియలేదు. దీన్ని ఎక్కడానికి చాలా కష్టపడాలి. సరైన దారి ఉండదు. కాబట్టే దీనికి ఈ పేరు పెట్టారేమో అని అనుకోవాలి.