మెడ నొప్పి అనేది సరిగ్గా కూర్చోకపోవడం, ఎక్కువ సమయం పాటు ఒకే పోజిషన్లో కూర్చోవడం ఇంజురీ అవ్వడం వలన సహజంగా వస్తుంది. మెడనొప్పి దూరం అవ్వాలంటే కొన్ని ఎక్సర్‌సైజెస్ చేయాలని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ ఎక్సర్సైజెస్ ఏంటో చూసేయండి.
నిజానికి మెడనొప్పి అనేది పెద్ద సమస్య కాదు. కొన్ని రోజులు శారీరక వ్యాయామం లేదా స్ట్రెచెస్ వంటివి చేస్తే తగ్గిపోతుంది. సీరియస్ మెనొప్పి అయితే మాత్రం తప్పకుండా డాక్టర్‌ను కన్సల్ట్ చేయాలి.ఒక వారం కంటే ఎక్కువ రోజులు మెడ నొప్పితో బాధపడుతుంటే వెంటనే మీరు డాక్టర్‌ని సంప్రదించాలి.
జీవనశైలిలో చిన్న మార్పులు వచ్చినా లేదా జాబ్‌లో ఎక్కువ ఒత్తిడి పెరగడం వలన మెడ నొప్పి వస్తుంది. ప్రస్తుతం చాలా వరకు వర్క్ ఫ్రం హోం ఉంటోంది. అలాంటప్పుడు ఎక్కువ సేపు స్క్రీన్ ముందు గడపాల్సి వస్తోంది. దీని వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. సోషల్ మీడియా వలన కూడా ఎక్కువ శాతం మెడను కిందికి వంచి ఉంచుతున్నారు, దాని వల్ల కూడా మెడ, భుజాలనొప్పులు వస్తున్నాయి.అలాంటప్పుడు మెడను పైకి, కిందికి అటుఇటుగా తిప్పలి. ఎక్కువసేపు ఒకే స్థితిలో మెడన ఉంచినట్లయితే, అది తిమ్మిరి ఎక్కడం, గట్టిగా మారడం, తక్కువ రక్తపోటు, కండరాల నొప్పి మొదలైన వాటికి దారితీస్తుంది.
ఇవే కారణాలు కాదు ఇంకా ఎన్నో కారణాల వల్ల మెడనొప్పి వస్తుంది. సరైన విధంగా నిద్రపోకపోవడం వల్ల కూడా మెడ నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదైనా వ్యాయామాలు లేదా జిమ్ చేస్తున్నప్పుడు మెడ పట్టేసి కొద్దిరోజుల పాటు నొప్పి కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవన్నీ నార్మల్గా మనకు తెలిసిన కారణాలే, నిజానికి హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి మెడ నొప్పి అనేది ఒక లక్షణం అని గుర్తించాలి. హార్ట్ ఎటాక్ లక్షణాలతో ఇబ్బంది పడుతూ మెడ నొప్పి కూడా ఉంటే తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లండి.
శారీరిక వ్యాయామం లేదా స్ట్రెచెస్, ఐస్ లేదా హీట్ తెరపీ చేయాలి. ఎక్కువగా మెడ నొప్పి ఉంటే నెక్ కాలర్‌ని కూడా ధరించాలి. నెక్ కాలర్‌ను ఉపయోగించేటప్పుడు డాక్టర్ని సంప్రదించడం మర్చిపోకండి. రోజూ నెక్ స్ట్రెచ్ చేయడం వల్ల మెడలో ఉండేటువంటి కండరాలు శక్తివంతంగా మారుతాయి. భవిష్యత్తులో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఎక్కువ రోజులు పాటు మెడ నొప్పితో బాధ పడితే భుజాలు ఇంకా చేతులకు కూడా ఆ నొప్పి వ్యాపిస్తుంది. ఇది తగ్గడానికి ఈ కింది ఎక్సర్సైజులు చాలా బాగా ఉపయోగపడతాయి.
1. ముందుగా ప్రశాంతకరమైన వాతావరణంలో మ్యాట్ పై వజ్రాసనంలో కూర్చొని నడుము నిటారుగా ఉంచండి, ఇప్పుడు మెడను కుడిచేయి సహాయంతో రెండు వైపులా తిప్పుతూ ఉండండి. ఒకవైపు తిప్పిన తిప్పి మూడు సెకన్ల వరకు ఉంచి ఇంకొక వైపు చెప్పండి. ఇలా చేయడం వల్ల మెడ దగ్గర ఉండే కండరాలు ఫ్లెక్సిబుల్ అవడమే కాకుండా దృఢంగా మారుతాయి. ఈ విధంగా మెడ నొప్పి తగ్గుతుంది.
ఇలా చేసిన తర్వాత కొంచెం రిలీఫ్ వస్తుంది. ఇప్పుడు అదే స్థితిలో ఉండి అంటే వజ్రాసనంలో కూర్చొని నడుమును నిలువుగా ఉంచి మెడను వెనక్కి చాచి చూడండి. ఇప్పుడు కొంచెం కిందకు వంచి ఉండండి, ఇదే భంగిమలో 30 సెకండ్ల పాటు ఉండండి .ఈ విధంగా ఉంటే మెడ దగ్గర ఉండే కండరాల పై ఒత్తిడి తగ్గుతుంది.
ఇలా చేసిన తర్వాత మీరు సుఖాసనంలో కూర్చుని రెండు చేతులని వెనుకకు వంచి, చేతులు కిందకు ఆన్చి మెడను స్ట్రెచెస్ చేయండి. ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, కొంచెం ఒత్తిడి చేతుల పైకి పెట్టి భుజాలు సహాయంతో శక్తిని పొందండి. ఇలా చేస్తే చేతులు, భుజాలు మరియు మెడ భాగాలలో ఉండే కండరాలకు రిలీఫ్ కలుగుతుంది.
2. మీ లెఫ్ట్ హ్యాండ్‌ను కుడి భుజంపై ఉంచాలి. మీరు ఈ దిశగా స్ట్రెచ్ అయినప్పుడు మీ ఎడమ భుజం పాపప్ అవ్వకుండా చూసుకోవాలి. మీ తలని కుడిభుజం వైపునకు మళ్ళించాలి. కాసేపు ఆ స్థితిలో ఉండాలి. తర్వాత మీ చెవులను కుడి భుజం వైపునకు తిప్పాలి. కొన్ని సెకన్లపాటు అలాగే ఉండాలి. ఇప్పుడు అదే వ్యాయామాన్ని మరొక వైపు రిపీట్ చేయండి. మీరు మీ మెడను ఎక్కువగా బెండ్ చేయవద్దు. ఒకటి లేదా రెండు సార్లు సున్నితంగా చేయాలి.
3. మీ మెడ వెనుక చేతులతో చప్పట్లు కొట్టండి. మీ గడ్డాన్ని కొద్దిగా పైకి లేపాలి. మీ మోచేతులను వెనుకవైపు తిప్పడానికి ప్రయత్నించండి. భుజాలు, వెనుక పైభాగాన,ఛాతి అంతా స్ట్రెచ్ అయినట్లు మీకు అనిపిస్తుంది. ఇప్పుడు 10 సెకన్లపాటు ఈవిధంగా ఉండాలి. ఆపై కాస్త విశ్రాంతి తీసుకోవాలి. వేగంగా చేస్తే.. గాయాలు అయ్యే ప్రమాదం ఉంది.కాబట్టి సున్నితంగా చేయండి.
ఈ ఎక్సర్సైజు వల్ల రోజు వారీ పనుల్లో మనకు కలిగే అసౌకర్యం పోతుంది. మెడనొప్పి ఉండదు. ఇవి చేసినా, లేదా చేస్తున్నప్పుడు కూడా మెడనొప్పి, భుజాలు నొప్పి ఉందనుకుంటే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి.