ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలో ఫీజుల గురించి చెప్పక్కర్లేదు. ఎల్‌కేజీ, యూకేజీలకే లక్షలు వసూలు చేస్తున్నారు. మన దేశంలోనే కాదు బయట దేశాల్లో కూడా ఫీజులు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ప్రపంచంలోకే అతి ఖరీదైన కొన్ని స్కూళ్లు గురించి తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అతి ఎక్కువ ఫీజు తీసుకునే స్కూళ్లలో స్విట్జర్లాండ్లో ఉన్న ‘బ్యూ సోలీల్ ఆల్ఫైన్ కాలేజీ’ ఒకటి. ఇందులో ఫీజు ఏడాదికి 1.50 లక్షల స్విస్ ఫ్రాంక్స్. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం అక్షరాల కోటీ ముప్పై నాలుగు లక్షల రూపాయలు.ఇంత ఎక్కువ ఫీజు ఉన్న ఈ స్కూళ్లలో ఎవురు చదువుతారు అనుకుంటే పొరపాటే. ఈ స్కూళ్లో అడ్మిషన్ల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులు పోటీపడుతుంటారు. ఇదేకాదు, ఈ దేశంలో మరో ఖరీదైన స్కూల్ కూడా ఉంది. అదే ‘రోసీ ఇన్‌స్టిట్యూట్’ఈ స్కూలులో సుమారు 430 మంది విద్యార్థులు ఏటా రూ.1.1 కోట్లు చెల్లించి చదువు కొంటున్నారు.
ఇదే జాబితాలో అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉన్న థింక్ గ్లోబల్ స్కూలు ఉంది. దీంట్లో ఏడాదికి రూ.77 లక్షలను వసూలు చేస్తారు. ఇందులో చేరిన విద్యార్థులు నాలుగు దేశాలు తిరిగి, ఆయా దేశాల్లో విద్యాభ్యాసం చేయాల్సి ఉంటుంది.
యునైటెడ్ కింగ్ డమ్ లోని హర్ట్‌వుడ్ హౌస్ స్కూళ్లో కూడా ఫీజ్ ఎక్కువే. వాటంతటకాకపోయినా సంపన్నలు మాత్రమే చదవగలరు. ఇక ఈ స్కూళ్లో ఏడాదికి రూ.25 లక్షల ఫీజు. ఇక్కడ సీటు దొరకడం చాలా కష్టం. డబ్బులు కట్టినవారందరికీ అడ్మిషన్ దొరుకదు. ముందుగా ఇంటర్వ్యూ పెట్టి, విద్యార్థి ప్రతిభ ఆధారంగా స్కూళ్లో జాయిన్ చేసుకుంటారు.