మోస్ట్ సెక్సియెస్ట్ మ్యాన్ ఇతడే.. అయినా డౌట్‌గా ఉందట.. - MicTv.in - Telugu News
mictv telugu

మోస్ట్ సెక్సియెస్ట్ మ్యాన్ ఇతడే.. అయినా డౌట్‌గా ఉందట..

November 13, 2019

పాటలతో జనాన్ని కట్టిపడేసే హాలీవుడ్‌ గాయకుడు జాన్‌ లెజెండ్‌ మోస్ట్ సెక్సియెస్ట్ మ్యాన్‌గా ఎంపికయ్యాడు. ‘పీపుల్’ పత్రిక 2019 ఏడాదికిగాను అతనికి ఈ ఘనత కట్టబెట్టింది. ఆఫ్రికన్-అమెరికన్ సంతతికి చెందిన లెజెండ్ చిన్నవయసులోనే గ్రామీ, ఎమ్మీ, ఆస్కార్ తదితర పురస్కారాలు అందుకున్నాడు. 

john legend.

తాజాగా ‘సెక్సియెస్ట్’ క్రెడిట్ రావడంతో ఉబ్బుతబ్బిబ్బు అవుతున్నాడు. ‘నటుడు ఇడ్రిస్‌ ఎల్బా 2018లో ఈ టైటిల్ గెల్చిన తర్వాత నేను ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. అదే సమయంలో నాలో ఒత్తిడి కూడా పెరిగింది. కొంచెం భయంగానూ ఉంది. నేను అంత సెక్సీగా ఉన్నానా లేదో అనుమానం కలుగుతోంది. ఈ విషయంలో నేను ఎల్బాలాగే నడుచుకుంటాను..’ అని చెప్పాడు. దీనిపై ఎల్బా కూడా సరదా స్పందించాడు. ‘ నువ్వు ఈ టైటిల్ పొందడానికి అర్హుడివే. కానీ సంగతి రాక్‌(నటుడు డానీ జాన్సన్) కు చెప్పకు. ఈ  టైటిల్‌ను గెలిచింది తనే అని అనుకుంటున్నాడు’ అని ట్వీట్ చేశాడు. ఎల్బా, డానీలు కూడా ఆఫ్రికన్ మూలాలు ఉన్నవారే.