తెలంగాణలో ఈ మూడు జిల్లాల్లోనే ఎక్కువ కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో ఈ మూడు జిల్లాల్లోనే ఎక్కువ కేసులు

June 11, 2022

తెలంగాణ రాష్ట్రంలో గత మూడు రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, గురువారం 12,385 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 122 మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా నమోదు అవుతున్న కేసుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే కేసులే ఎక్కువగా వస్తున్నాయని, ఒక్క హైదరాబాద్‌లోనే తాజాగా 94 కేసులు నమోదు అయినట్లు పేర్కొన్నారు. ఇక, రంగారెడ్డి జిల్లాలో 12, మేడ్చల్ జిల్లాలో 9 కేసులను గుర్తించామని అధికారులు శవివారం వివరాలను వెల్లడించారు.

‘బుధవారం తెలంగాణలో 116 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 731కి చేరింది. గురువారం 122 కొత్త కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 811కు చేరుకుంది. రాష్ట్రంలో డైలీ పాజిటివిటీ రేటు 1 శాతం దాటింది. తెలంగాణలో మార్చి 7న 102 కేసులు నమోదు కాగా, ఏప్రిల్ 17న 11కి పడిపోయాయి. కరోనా మొదలైన తర్వాత రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం అదే తొలిసారి. కాగా, మే నెల మధ్యలో మళ్లీ రోజువారీ కరోనా కేసులు 119కి చేరాయి.’

మరోపక్క రాష్ట్రంలో ఇప్పటి వరకూ 7,94,029 కరోనా కేసులను అధికారులు గుర్తించారు. గురువారం నాటికి తెలంగాణలో కరోనా బారిన పడి 4111 మంది ప్రాణాలు కోల్పోగా, గత మూడు నెలలుగా రాష్ట్రంలో కరోనా మరణాలేవీ నమోదు కాలేదు. గురువారం రాష్ట్రంలో 42 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని, దీంతో మొత్తం రికవరీ అయిన వారి సంఖ్య 7,89,107కి చేరినట్లు వైద్యులు తెలిపారు.