ప్రస్తుత సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో సినిమాలకు రేటింగ్స్ ఇచ్చే ఐఎండీబీ తాజాగా స్టార్లకు రేటింగ్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 మిలియన్ల ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలను స్వీకరించి భారత్ నుంచి టాప్ టెన్ స్టార్లను ఎంపిక చేసింది.
అందులో ధనుష్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తర్వాత బాలీవుడ్ హీరోయిన్లైన అలియాభట్, ఐశ్వర్యారాయ్ లు ఉన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 4, సమంత 5 స్థానాల్లో నిలిచారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ 8, అల్లు అర్జున్ 9, 10వ ర్యాంకులో కేజీఎఫ్ యశ్ లకు జాబితాలో చోటు దక్కింది. హృతిక్ రోషన్, కియారా అద్వానీ వరుసగా ఆరు ఏడు స్థానాలు సంపాదించుకున్నారు. కాగా, ధనుష్ హాలీవుడ్ సినిమాలో నటించడంతో పాటు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకొని ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నారు. అల్లు అర్జున్ పుష్ప, యశ్ కేజీఎఫ్, సమంత పుష్పలో ప్రత్యేక గీతం, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయంగా ఫేమస్ అవడంతో జాబితాలో చోటు దక్కిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.