తండ్రి అయిన బ్రహ్మచారి ! - MicTv.in - Telugu News
mictv telugu

తండ్రి అయిన బ్రహ్మచారి !

August 9, 2017

బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, ఆక్టర్, టీవీ ప్రెసెంటర్ ఎవరంటే ఠక్కున కరణ్ జోహర్ పేరే చెప్తారు ఎవరైనా. ఈ బడా బ్రహ్మచారి 7 ఫిబ్రవరిన సరోగసీ ద్వారా తండ్రయ్యాడు. ఇంత వరకు తన పిల్లల ఫోటోలు బయటకు చూపించలేదు. ఆర్నెల్ల తర్వాత తన ముద్దు ముద్దుల ఇద్దరు పిల్లల ఫోటోలను ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా విడుదల చేసాడు. కొడుకు పేరును తండ్రి పేరు కలిసొచ్చేలా యాష్ అని, కూతురు పేరును తన తల్లి పేరు హిరూ వుంటే తిరగేసి రూహీ అని పెట్టుకున్నాడు. తన తల్లి దండ్రులే మళ్ళీ పుట్టారన్నంత ఆనందంగా వున్నాడు కరణ్.

పిల్లలిద్దరూ చాలా క్యూట్ గా వున్నారని సోషల్ మీడియాలో చాలా మంది పిల్లలపై ముద్దుల వర్షం కురిపిస్తున్నారు. పిల్లలు నెలలు నిండకుండానే పుట్టడం వల్ల హెల్త్ ఇష్యూ కారణంగా నెల రోజుల వరకు హాస్పిటల్లోనే వుంచవలిసి వచ్చిందని అంటున్నాడు. లేటు వయసులో తండ్రి అవడం పట్ల చాలా హ్యాప్పీగా వున్నాడు కరణ్. తన సొంత ప్రొడక్షన్ కంపెనీ అయిన ‘ ధర్మా ప్రొడక్షన్ ’ నుండి 3 నవంబర్ 2017 కు ‘ ఇత్తెఫాఖ్ ’ అనే సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. అలాగే 2018 కి కూడా ‘ డ్రైవ్ ’ అనే చిత్రం కూడా నిర్మాణ దశలో వుంది. అటు సినిమాలు ఇటు పిల్లల ఆలనా పాలనతో మరింత బిజీగా మారునున్న కరణ్ జోహర్ కు కంగ్రాట్స్ చెబుదామా.

 

https://ujjawalprabhat.com/%E0%A4%AA%E0%A4%BE%E0%A4%AA%E0%A4%BE-%E0%A4%95%E0%A4%B0%E0%A4%A3-%E0%A4%9C%E0%A5%8C%E0%A4%B9%E0%A4%B0-%E0%A4%A8%E0%A5%87-%E0%A4%AA%E0%A5%8B%E0%A4%B8%E0%A5%8D%E0%A4%9F-%E0%A4%95%E0%A5%80-%E0%A4%A4/99872/