ఒక్కోసారి యాదృచ్ఛికమైన సంఘటనలు మనల్ని ఆనందంలో ముంచెత్తుతాయి. అలాగే ఇటలీలో జరిగిన ఒక సంఘటన ఆశ్చర్యానికి గురి చేసింది. గంటల వ్యవధిలో తల్లీకూతుళ్లు బిడ్డలకు జన్మనిచ్చి సంతోషాన్ని పంచుకున్నారు.
నేపుల్స్ (ఇటలీ)లోని కార్డరెల్లి ఆసుపత్రి. అక్కడ కొన్ని గంటల తేడాతో తల్లీకూతుళ్లు ప్రసవించారు. మారా జన్మనిచ్చిన బిడ్డ ఫ్యూచురా 3 కిలోల 860 గ్రాములు, పావోలా జన్మనిచ్చిన జియోవన్నీ 3 కిలోల 400 గ్రాములు ఉన్నారు. తల్లి మారా బరోన్ జీవశాస్త్రవేత్త. తనకిది రెండవ డెలివరీ. ఆమె అమ్మ, అమ్మమ్మ ఒకేసారి అయింది. కుమార్తో పావోలా మారా పెద్ద కుమార్తె. 21 సంవత్సరాల వయసులోనే గియోవన్నీకి జన్మనిచ్చింది.
అమ్మ మారా..
మారాకు 35యేండ్లు. 2002లో ఆమె కుమార్తె పావోలా జన్మించినప్పుడు ఆమెకు 15 యేళ్లు. చిన్నవయసులో పెండ్లి, పిల్లలు కష్టంగా అనిపించింది. కానీ అబార్షన్ చేయించుకునేందుకు మాత్రం మనసు రాలేదు. అలా పావోలా తన జీవితంలోకి వచ్చింది. ఈసారి మాతృత్వం గురించి ఎక్కువ అవగాహన ఉండడం వల్ల నేను మరింత ఆందోళన చెందాను’ అని ఆమె చెప్పింది.
కూతురు పావోలా..
పావోలాకి 21యేండ్లు. ఆమె తన తల్లితో కలిసి జన్మనిచ్చింది. గర్భంతో ఉన్నప్పుడు ఇద్దరూ కలిసే ఉన్నారు. ఇద్దరూ ఈ విషయం తెలుసుకొని షాక్ అయ్యారు. ఈ డబుల్ బర్త్ లోని ప్రత్యేకత ఏమిటంటే.. ఇద్దరికీ ఆకస్మిక గర్భం రావడం. ఏ సమస్య లేకుండా ఇద్దరూ పిల్లలకు జన్మన్నిచ్చారు. మూడు తరాలకు చెందిన ఫోటోను అక్కడి డాక్టర్లు పంచుకున్నారు.
ఇలా తల్లీకూతుళ్లు ఒకేసారి గర్భం దాల్చడం కొత్తేమీ కాదు. ఇప్పటికీ ఇలాంటి కేసులు చాలానే నమోదయ్యాయి. కాకపోతే గంటల వ్యవధిలోనే కనడం కాస్త విచిత్రంగా ఉందంటున్నారు.