మత్తు కోసం...శానిటైజర్ తాగి తల్లి, తనయుడు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

మత్తు కోసం…శానిటైజర్ తాగి తల్లి, తనయుడు మృతి

June 2, 2020

nbgh

కడప జిల్లాలో దారుణం జరిగింది. మద్యానికి బానిసైన తల్లి, తనయుడు శానిటైజర్ తాగి ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన జిల్లాలోని చెన్నూరులో జరిగింది. ప్రభుత్వం మద్యం ధరలను గణనీయంగా పెంచడంతో స్థానిక ఎల్లమ్మగుడి వీధిలో ఉండే విజయలక్ష్మి, ఆమె కుమారుడు శ్రీరామ్ నాయక్ మత్తును కలిగించే శానిటైజర్లు తాగడం అలవుతూ చేసుకున్నారు. 

ఈ క్రమంలో ఇటీవల శానిటైజర్ తాగి వారిద్దరూ కుప్పకూలిపోయారు. ఇంటి పక్కనున్నవారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకుని తల్లి, తనయులను జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునే లోపే వారిద్దరూ ప్రాణాలు కోల్పోయినట్టు డాక్టర్లు ప్రకటించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.