Mother Bare comes fastfood center Srikakulam
mictv telugu

ఏపీ: ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు వచ్చిన ఎలుగుబంట్లు

August 8, 2022

Mother Bare comes fastfood center Srikakulam

అడవులను నిర్దాక్షిణ్యంగా నరికేసి ప్లాట్లు, ఫ్యాక్టరీలు, మైనింగ్‌కు పాల్పడుతుండడంతో వన్యమృగాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అడవిలో తిండి దొరక్క పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు ఊర్లకు వస్తున్నాయి. జనంపై దాడి చేస్తున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం చినవంకలోని ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లోకి మూడు ఎలుగుబంట్లు చొరబడ్డాయి. తల్లి ఎలుగుబంటి తన రెండు పిల్లలతో విచ్చేసి సెంటర్ ముందు తచ్చాడింది.

తిండి కోసమే అది అక్కడికి చేరిందని స్థానికులు భావిస్తున్నారు. ఇటీవల వజ్రపుకొత్తూరు మండలంలో ఎలుగుబంట్లు గ్రామాల్లోకి చొరబడి ముగ్గురిని చంపేశాయి. అవి ఊర్లలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అటవీ శాఖ అధికారులను వేడుకుంటున్నారు.