అమ్మ బౌలింగ్ - బుడ్డోడి బ్యాటింగ్.. వీడియో సూపర్ - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మ బౌలింగ్ – బుడ్డోడి బ్యాటింగ్.. వీడియో సూపర్

January 14, 2020

Mother Blowing.

క్రికెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆ ఆటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మ్యాచ్ వస్తోందంటే క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. ఓ బుల్లి క్రికెటర్ వీధిలోనే బ్యాట్ పట్టుకుని గల్లీ క్రికెట్ ఆడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. క్రికెట్ అభిమానులకు ఈ వీడియో విపరీతంగా నచ్చేసింది. ఈ వీడియోలో మరో ప్రత్యేకత ఉంది. ఆ బుల్లి క్రికెటర్‌కు బంతి విసిరింది అతని తల్లే. తన రెండేళ్ల కొడుకు కోసం  ఆ అమ్మ బౌలర్ అవతారమెత్తింది. వీధుల్లో బౌలింగ్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. రద్దీగా ఉన్న రోడ్డులో తన కుమారుడికి బౌలింగ్‌ చేసింది. 

ఇందుకు సంబంధించిన వీడియోను టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ‘కొడుకు బ్యాటింగ్‌.. అమ్మ బౌలింగ్‌..  మొత్తానికి బ్యూటిఫుల్‌’ అని పేర్కొన్నాడు. వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘ఈ బుడ్డోడు భవిష్యత్తులో మంచి క్రికెటర్ అవుతాడు’ అని కామెంట్లు చేస్తున్నారు. క్రికెట్‌ అభిమానులు విపరీతంగా ఈ వీడియోను షేర్‌ చేస్తున్నారు.