తల్లిబిడ్డల గొప్పతనానికి ఈ ఘటనే నిదర్శనం.. - MicTv.in - Telugu News
mictv telugu

తల్లిబిడ్డల గొప్పతనానికి ఈ ఘటనే నిదర్శనం..

October 17, 2018

చుక్కల్లో చంద్రుడు ఉంటాడో లేదో తెలిదూ.. ఆకాశంలో సూర్యుడు ఉంటాడో లేదో ఊహించలేదు.. వర్షం వస్తే నదిలో నీరు ఉంటాయో ఇంకిపోతాయో తెలిదూ .. గుడిలో దేవుడు ఉంటాడో లేదో కనిపించలేదు.. కానీ ప్రాణం ఉన్నంత వరకు తల్లిప్రేమలో మార్పు ఉండదు, రాదు. తల్లీబిడ్డల ప్రేమ బిడ్డల ఏనలేనిది. అందుకే తల్లి స్పర్శ బిడ్డకు తెలిసిపోతుందని పెద్దలు చెబుతుంటారు. సాధారణంగా చిన్నపిల్లలను ఏడ్చినప్పుడు ఎవరు ఎత్తుకున్నా.. ఏడుపు ఆపరు. కానీ తల్లి ఒక్కసారి దగ్గరికి తీసుకుని హత్తుకోగానే ఏడుపు ఆపేయడాన్ని మనం చాలా సార్లు చూసుంటాం.Mother Cure From Koma For His Son Touching Her Heart In America Brezil తాజాగా బ్రెజిల్‌లో మరో అద్భుతమైన ఘటన చోటు చేసుకుంది. తల్లి ప్రసవానికి కొన్నిరోజుల ముందు కోమాలోకి వెళ్లిపోయింది. కానీ ప్రసవం అనంతరం తన కొడుకు స్పర్శ తగలగానే స్పృహలోకి వచ్చేసింది. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. బ్రెజిల్‌లోని ఫోర్టాలెజా ప్రాంతంలో అమండా డిసిల్వా(28) తన భర్తతో కలిసి ఉంటోంది. ఈ దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలున్నారు. మరోసరి గర్భదాల్చిన అమండా మూర్చ వ్యాధితో ఉంది. కాగా డెలివరీకి రెండు వారాల ముందు కోమాలోకి వెళ్లింది. దీంతో 9 నెలలు పూర్తయ్యాక వైద్యులు సిజేరియన్ నిర్వహించి చిన్నారిని బయటకు తీశారు. మొదట శిశువుకు వైద్యం అందించిన వైద్యులు ఆ బిడ్డను తల్లి గుండెలపై పడుకోబెట్టారు. దీంతో అమండా కొద్ది సేపటికే మెలకువలోకి వచ్చింది. ‘నాకు డెలివరీ ఎలా జరిగిందో తెలిదనీ, నవజాత శిశువుకు విక్టర్‌గా పేరు పెడతాను’ అని అమండా పేర్కొంది.