Mother elephant saving calf from drowning Nagrakata in North Bengal
mictv telugu

ఏనుగు తల్లికి జేజేలు… నదిలో కొట్టుకుపోతున్న పిల్లను ఇలా..

June 25, 2022

 Mother elephant saving calf from drowning Nagrakata in North Bengal

తల్లిప్రేమకు సాటివచ్చేది సృష్టిలో ఏదీ లేదు. తన ప్రాణాలను సైతం అర్పించి బిడ్డను కాపాడుకుంటుంది తల్లి. మనుషులే కాదు, పశుపక్ష్యాదులు కూడా బిడ్డలను అలవిగాని ప్రేమతో కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. భావోద్వేగాల్లో మనిషితో సమానంగా స్పందించే ఏనుగుల విషయం చెప్పాల్సిన పనే లేదు. గున్నేనులకు శత్రువుల నుంచే కాదు ప్రకృతి విపత్తుల నుంచే కాపాడుకోవంలో వాటి తెలివి అమోఘం. అలాంటి ఓ తల్లి ఏనుగు నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న తన పిల్లను కాపాడుకున్న వీడియో ఇది.

పశ్చిమ బెంగాల్‌లోని నగ్రకటా ప్రాతంలో ఈ సంఘటన జరిగింది. ఏనుగుల గుంపు నదిని దాటుతుండగా ఓ బుల్లి ఏనుగు నీటి ఉధృతిని తట్టుకోలేక ముందకెళ్లిపోయింది. తల్లి రక్షించుకునే లోపే కొద్ది దూరం కొట్టుకుపోయింది. తల్లి ఏనుగు వేగంగా ముందుకెళ్లి బిడ్డ ముందు అడ్డుగా నిలబడింది. తొండంతో, కాళ్లతో తోస్తూ పిల్లను ఒడ్డుకు భద్రంగా తీసుకెళ్లి మిట్ట ఎక్కించింది. తర్వాత రెండు మందలో కలసి చక్కా పోయాయి. ఈ వీడియో అటవీ శాఖ అధికారి ప్రవీణ్ కాస్వాన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

 

 

Mother elephant saving calf from drowning Nagrakata in North Bengal

Mother elephant,  saving calf, River drowning, Nagrakata, North Bengal