మనిషి కాదు ఏనుగు.. అందుకే థ్యాంక్స్ చెప్పింది (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

మనిషి కాదు ఏనుగు.. అందుకే థ్యాంక్స్ చెప్పింది (వీడియో)

November 11, 2019

తిన్నింటి వాసాలు లెక్కపెట్టడంలో మానవ జాతి తర్వాతే జాతి అయినా. చేసిన సాయాన్ని మరిచిపోవడమే కాకుండా కీడు కూడా తలపెడుతుంటారు మనుషులు. కానీ ఓ ఏనుగు మాత్రం తన కన్నబిడ్డను కాపాడినందుకు భావోద్వేగంతో థ్యాంక్స్ చెప్పింది. మాటిమాటికీ తొండాన్ని పైకెత్తి.. ధన్యవాదాలు తెలుపుకుంది. చూపరులను కట్టిపడేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఓ గుంతలో పడిపోయిన ఏనుగు పిల్లను రక్షించడానికి పెద్ద ఏనుగులు శాయశక్తులా ప్రయత్నించాయి. గున్నను బయటికి తీయడం వాటికి సాధ్యం కాలేదు. ఇంతలో అటవీ సిబ్బంది, స్థానికులు అక్కడికి వచ్చారు. పెద్ద ఏనుగులు చాటుకు తప్పుకున్నాయి. జనం జేసీబీ సాయంతో మన్నును గుంతలో నింపడంతో పిల్ల గునుగున బయటికి వచ్చింది. పెద్ద ఏనుగులు దాన్ని అక్కున్న చేర్చుకున్నాయి. తల్లి ఏనుగు తన పిల్లను కాపాడినందుకు కృతజ్ఞతగా తొండాన్ని మనుషులవైపు పైకి చాచింది. మళ్లీ మళ్లీ పైకెత్తి ధన్యావాదాలు తెలిపింది. తర్వాత మిగతా ఏనుగులతో కలసి పిల్లను తీసుకుని అడవుల్లోకి వెళ్లింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియడం లేదు. కేరళలో జరిగినట్లు చెబుతున్నారు. ఈ వీడియో నిజానికి 2017లో యూట్యూబులో వచ్చింది. ప్రవీణ్ ట్విటర్లో పోస్ట్ చేయడంతో మరోసారి వైరల్ అయంది.   మనం మరిచిపోతున్నకృతజ్ఞతను గుర్తుకు తెచ్చే వీడియోనూ మీరూ చూడండి మరి..