అత్తరుణం ఇలా తీర్చుకున్న కోడళ్లు.. - MicTv.in - Telugu News
mictv telugu

అత్తరుణం ఇలా తీర్చుకున్న కోడళ్లు..

September 11, 2019

Mother ....

ప్రస్తుతం బుల్లితెరపై అత్తా కోడళ్లను చూస్తే పాము, మింగీసలా కనిపిస్తారు. ఇద్దరికి ఏమాత్రం పొసగదు. ఒకరిని చూస్తే మరొకరికి కడుపు మంట ఉంటుంది. అయితే ఇటువంటి భావన తప్పని చాలా మంది అత్తా కోడళ్లు తమ ప్రవర్తనతో నిరూపించారు. తాజాగా మహారాష్ట్రకు చెందిన నలుగురు కోడళ్లు తమ అత్తకోసం ఏకంగా పాడెనే మోశారు. అయిన వారంతా ఉన్నా తామే అత్త శవాన్ని మోస్తామని చెప్పి కడసారి ఆమె రుణం తీర్చుకున్నారు. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. వీళ్ల అనుబంధానికి అంతా ముగ్ధులైపోతున్నారు. 

tf

బీద్‌ జిల్లాకు చెందిన సుందర్‌భాయి దగ్దు నైక్వాడే(83)కు అనే మహిళకు నలుగురు కుమారులు. దీంతో ఆమె ఇళ్లు అంతా కోడళ్లు, మనుమలు, మనుమరాళ్లతో సందడిగా ఉండేది. తన కోడళ్లను కూడా ఆమె సొంత కూతుళ్ల కన్నా ఎక్కువ జాగ్రత్తగా చూసుకునేది. అంత మంచి మనసు చాటుకున్న ఆమె  అనారోగ్యంతో సోమవారం మరణించింది.

కన్న బిడ్డల్లా తమను చూసిన అత్త మరణాన్ని వారు తట్టుకోలేకపోయారు.అత్త రుణం ఎలా తీర్చుకోవాలని కోడళ్లు ఆలోచించారు. వెంటనే తామే స్వయంగా అత్త పాడే మోస్తామని చెప్పి ఆ పని పూర్తి చేశారు. కొడుకులు, బంధువులు ఎంతో మంది ఉన్నా కోడళ్లు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించడాన్ని చూసి వారి ఆత్మీయ అనుబంధం ఎంత గొప్పదో చెబుతోందని ఇది తెలిసినవారంతా వ్యాఖ్యానిస్తున్నారు.