Mother-in-law daughter-in-law annamayya district
mictv telugu

కోడలి తల నరికిన అత్త.. అన్నమయ్య జిల్లాలో..

August 11, 2022

Mother-in-law daughter-in-law  annamayya district

‘అత్తలేని కోడలుత్తమురాలు ఓ యమ్మా.. కోడల్లేని అత్త గుణవంతూరాలు..’ అని పల్లె ఆడవాళ్లు పాడుకునే పాటలో సత్యం ఉందేమో! అందరూ కాకపోయినా కొంతమంది అత్తాకోడళ్ల మధ్య ఏ గడ్డీ వేయకున్నా భగ్గుంటుంది. కొట్లాటలు కాస్తా ఘోరాలకు కూడా దారితీస్తుంటాయి. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఓ అత్త రాకాసిలా మారి కోడలి తలను నరికింది. తర్వాత ఆ తలను చేత్తో పట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. తానే చంపానని, ఏ శిక్ష వేసుకుంటారో వేసుకోండని చెప్పింది.

రాయ‌చోటి మండ‌లం కె.రామాపురానికి సుబ్బ‌మ్మకు, ఆమె కోడ‌లు వ‌సుంధ‌రతో గొడవలు ఉన్నాయి. గురువారం కలహాలు కాస్తా ముదిరిపోయాయి. సుబ్బమ్మ కోపంతో ఊగిపోయింది. కత్తితో కోడలి తల నరికేసింది. తలను పట్టుకుని వీధుల్లోంచి నడుస్తూ ఠాణాలకు వెళ్లిపోయింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.