వేధింపులు తాళలేక ఆరుగురు పిల్లలతో బావిలో దూకేసిన తల్లి - MicTv.in - Telugu News
mictv telugu

వేధింపులు తాళలేక ఆరుగురు పిల్లలతో బావిలో దూకేసిన తల్లి

May 31, 2022

అత్తింటి వేధింపులు భరించలేక ఆరుగురు పిల్లలున్న ఓ మహిళ తీవ్ర నిర్ణయం తీసుకుంది. పిల్లలందరినీ బావిలోకి తోసేసి తాను కూడా అందులో దూకేసింది. మహారాష్ట్ర రాయగఢ్ జిల్లా ఖర్వాలీ గ్రామంలో ఈ ఘోర ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మహిళకు అత్తింటి వారికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్తింటి వారు మహిళపై దాడికి దిగగా, మహిళ తీవ్ర మనస్థాపానికి గురైంది. ఆవేశంలో తన ఆరుగురు పిల్లలను తీసుకొని సమీపంలోని బావిలోకి తోసేసింది. తర్వాత తాను కూడా దూకేసింది. గమనించిన స్థానికులు వెంటనే బావిలోకి దూకి మహిళను రక్షించగా, ఆరుగురు పిల్లలు అప్పటికే చనిపోయారు. మృతులైన చిన్నారుల్లో ఒక బాబు, ఐదుగురు బాలికలు ఉన్నారు. వీరి వయస్సు 18 నెలల నుంచి 10 ఏండ్ల లోపు ఉంది. విషయం పోలీసులకు చేరడంతో వారు వచ్చి విచారించగా, బాధిత మహిళ ఫిర్యాదు మేరకు అత్తింటి వారిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.