పాల కోసం ఏడ్చిందని గొంతు కోసిన తల్లి - MicTv.in - Telugu News
mictv telugu

పాల కోసం ఏడ్చిందని గొంతు కోసిన తల్లి

February 9, 2018

పనికిమాలిన కారణాలతో పిల్లలను హింసించే వారిని దూషించడానికి ఏ తిట్లూ సరిపోవు. కన్నతల్లి, కన్నతండ్రి అనికాకుండా కన్నరాక్షసి, రాక్షసుడు అని అనడం కూడా తక్కువే. క్షణికావేశంలో తల్లిదండ్రులు పేగు తెంచుకుని పుట్టిన బిడ్డల ఉసురు తీస్తున్నారు. మధ్యప్రదేశ్‌ ఒక మహిళ.. పాల కోసం ఏడిపిస్తోందంటూ కూతురిని గొంతుకోసి చంపేసింది.కుశి జిల్లాలోని ధార్‌లో ఈ గురువారం ఘోరం జరిగింది. అనిత అనే మహిళకు ఏడాది వయసున్న పాప ఉంది. పాప పాల కోసం ఏడుస్తుండడంతో అతని సహనం కోల్పోయింది. పదునైన ఆయుధంతో చిన్నారిని గొంతుకోసి చంపేసింది. పసిపిల్ల అక్కడికక్కడే చనిపోయింది. పోలీసులు అనితను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ దారుణం జరిగినప్పుడు అనిత ఇంట్లో ఎవరూ లేరని పోలీసులు చెప్పారు. పాల కోసం అస్తమానం ఏడిపిస్తున్నందుకే చంపానని అనిత చెబుతోంది. అయితే ఆడపిల్ల కావడం వల్లే చంపిందేమోననే అనుమానంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు.