ఆడపిల్ల అని ఆటోలో వదిలేసిపోయారు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆడపిల్ల అని ఆటోలో వదిలేసిపోయారు..

August 23, 2017

సమాజం ఎంత పురోగమిస్తున్నా లింగ వివక్షకు తెరపడటం లేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోవిందరావ్ పేటలో ఓ తల్లి అప్పుడే పుట్టిన ఓ పసిపాపను ఆటోలో వదిలేసి పోసింది. శిశువును గమనించిన స్ధానికులు అక్కున చేర్చుకొని  పోలీసులకు సమాచారమిచ్చారు. ఆర్థిక కష్టాల వల్లే బిడ్డను వదిలేసి ఉంటారని భావిస్తున్నారు.

గర్భస్థ దశలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడంపై నిషేధం ఉన్న నేపథ్యంలో చాలా మంది ఆ పరీక్షలకు వెళ్లడానికి భయపడుతున్నారు. దీంతో ఇటీవల కాలంలో భ్రూణ హత్యలు తగ్గాయి. అయితే ప్రసవం తర్వాత ఆడపిల్లను వదిలేస్తున్న సంఘటనలు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి.  ఆడపిల్లలపై వివక్ష దీనికి కారణం.