పసిబిడ్డను వదిలి వెళ్లిన తల్లి.. కారణం ఇదేనట..! - MicTv.in - Telugu News
mictv telugu

పసిబిడ్డను వదిలి వెళ్లిన తల్లి.. కారణం ఇదేనట..!

February 27, 2020

GN V

పుట్టిన మగ బిడ్డను వదలేసి ఎవరికీ తెలియకుండా వెళ్లిపోయేందకు ప్రయత్నించింది ఓ కన్న తల్లి. గాంధీ ఆస్పత్రిలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రి ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారిని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. వెంటనే సీసీ ఫుటేజీ ఆధారంగా తల్లిని గుర్తించారు. బస్సు ఎక్కి ఇంటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఆ మహిళలను గుర్తించి తిరిగి బిడ్డను అప్పగించారు. ప్రస్తుతం వారిని శిశు విహార్‌కు తరలించారు. 

కామారెడ్డికి చెందిన మంజుల ఈనెల 25న కాన్పు కోసం వచ్చింది. ఆమెకు మగబిడ్డ పుట్టడంతో ఆస్పత్రిలోనే వైద్య పర్యవేక్షణకు ఉంచుకున్నారు. ఈ క్రమంలో మానసిక స్థితి సరిగాలేని మంజుల తన బిడ్డను వదిలి వెళ్లిపోయింది. ఆమె వెంట ఉన్నవారు కూడా సరిగా పట్టించుకోకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. శిశువు చేతికి ఉన్న ట్యాగ్‌ ఆధారంగా వివరాలు సేకరించి ఆమె కోసం వెతికారు. బస్టాప్‌లో ఉన్న ఆమె చేతికి కూడా ఒకే రకమైన ట్యాగ్ ఉండటంతో ఆస్పత్రికి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత వారిని సంరక్షణ కేంద్రానికి తరలించారు.