Home > Featured > తల్లి ఫోన్ పిచ్చి… పిల్ల ప్రాణం త్రుటిలో దక్కింది…

తల్లి ఫోన్ పిచ్చి… పిల్ల ప్రాణం త్రుటిలో దక్కింది…

mother left her child on the road while talking on the phone

ఫోన్ లో నిమగ్నమైన ఓ తల్లి.. స్కూల్ కు పంపాల్సిన చిన్నారిని రోడ్డుమీదికి వదిలేసింది. అంతలోనే ఆ రూట్లో ఓ కారు రావడం.. కనురెప్ప మూసి తెరిచే టైమ్లో యాక్సెడెంట్ తప్పిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఆ పాపను దేవుడిలా వచ్చి కాపాడాడు ఓ ఆర్మీ పర్సన్. అంతేకాకుండా ఆ పాపను స్లిట్ ఆఫ్ సెకన్స్లో పట్టుకుని కారు యాక్సిడెంట్ నుంచి కాపాడతాడు. అప్పటికీ కూడా ఆ తల్లి వదలకుండా మాట్లాడుతున్న ఫోన్ని లాగేసుకుని నేలకు విసిరి కొడతాడు.

ఈ నెల 13 న తెలుగు రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఫోన్ వాడకం మంచిదే కానీ, చుట్టూ పక్కల పరిస్థితిని గమనించకుండా అందులోనే నిమగ్నమైతే ప్రమాదాలు తప్పవు. ప్రతీ చోటా ఓ ఆర్మీ పర్సన్ ఉండడు కాబట్టి.. ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలి.

Updated : 24 Jun 2022 7:00 AM GMT
Tags:    
Next Story
Share it
Top