mother monkey came to the hospital with a baby for treatment in bihar
mictv telugu

చికిత్స కోసం పిల్లతో ఆస్పత్రికి వచ్చిన తల్లి కోతి.. వీడియోనే సాక్ష్యం

June 9, 2022

mother monkey came to the hospital with a baby for treatment in bihar

కోతులు గుంపులుగా ఉంటే మనం భయపడతాం. అదే మనం గుంపులుగా ఉండి కోతులు ఒకటో రెండో ఉంటే అవి భయపడతాయి. అది సహజం. అయితే ఒంటరిగా కనిపించే కోతులపై చాలా మంది రాళ్లు, ఇటుకలతో దాడి చేస్తారు. అలా గాయపడిన ఓ కోతి చాలా ధైర్యం చేసింది. తనకు తగిలిన గాయాలకు చికిత్స తీసుకునేందుకు ఏకంగా మనం చూపించుకునే ఆస్పత్రికి వచ్చేసింది. మొదట్లో కోతిని చూసి భయపడిన వైద్యుడు తర్వాత జాలి పడి దానికి చికిత్సనందించాడు. ఆ తర్వాత మనలాగే కాసేపు ఆస్పత్రిలో విశ్రాంతి తీసుకొని ఆ కోతి వెళ్లిపోయింది.

ఇదంతా కల్పిత స్టోరీ కాదు. నిజంగా జరిగింది. ఇందుకు సాక్ష్యంగా వీడియో కూడా ఉంది. వివరాల్లోకెళితే.. బీహార్‌లోని ససారం గ్రామంలో ఓ కోతి తన పిల్ల కోతితో ప్రవేశించింది. దాన్ని చూసిన చిన్న పిల్లలు రాళ్లు, ఇటుకలతో దాడి చేసి గాయపరిచారు. దాంతో ఎంతో బాధపడిన తల్లి కోతి.. మనుషులు వైద్యం చేయించుకునే ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చింది. మనలాగే డాక్టరు వచ్చే వరకూ అక్కడి బెంచి మీద కూర్చుని వెయిట్ చేసింది. ఆయన వచ్చిన తర్వాత తనకు తగిలిన గాయాలను చూపగా, మొదట ఆశ్చర్యపోయిన వైద్యుడు తర్వాత జాలిపడి ఆ గాయానికి మందు రాశాడు. అనంతరం అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకన్న కోతి తర్వాత తన దారిన వెళ్లిపోయింది. కాగా, ఇదంతా వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.