24 ఏళ్లకే 22 మంది పిల్లలకు తల్లి - MicTv.in - Telugu News
mictv telugu

24 ఏళ్లకే 22 మంది పిల్లలకు తల్లి

March 22, 2022

24

ఓ మహిళ 24 ఏళ్లకే 22 మంది పిల్లలకు తల్లి అయిన సంఘటన రష్యా దేశంలో చోటుచేసుకుంది. ఆ మహిళ అంతమంది పిల్లలకు ఎలా జన్మనిచ్చింది? ఆ 22 మంది పిల్లలకు ఎంత వయస్సు ఉంటుంది? అనే అనుమానులు రావొచ్చు. మరి ఎలా సాధ్యమైందో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా.. రష్యా దేశానికి చెందిన క్రిష్టినా ఓజ్‌టుర్క్ (24) అనే యువతి. 57 ఏళ్ల గాలిప్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ జంట సరోగసీ ప్రక్రియ ద్వారా పిల్లలకు జన్మనిచ్చింది. దీని కోసం వాళ్లు చాలా డబ్బును వెచ్చించారు. అలా పొందిన ఆ పిల్లలకు రెండేళ్ల కన్నా తక్కువ వయస్సే. వారి ఆలనా పాలనా అంతా క్రిష్టినానే చూసుకుంటోంది.

ఈ నేపథ్యంలో అందరి తల్లుల్లాగనే తాను వారికి అన్ని పనులు చేస్తానని, తన పిల్లలతో తనకు సమయమే తెలియడం లేదని క్రిస్టినా ఆనందంగా చెబుతోంది. స్వయంగా కనకపోయినా ఆ పిల్లలపై తనకు విపరీతమైన ప్రేమ ఉందని క్రిష్టినా చెప్పింది. అయితే, తనుకు ఈ 22 మంది పిల్లలు సరిపోరని, వంద మంది పిల్లలు కావాలని చెప్పింది.

ప్రస్తుతం క్రిష్టినా, గాలిప్‌లు తమ పిల్లలతో కలసి జార్జియాలోని బటుమీలో నివసిస్తున్నారు. అయితే మొదట క్రిస్టినా, గాలిప్‌లో ప్రతి ఏడాది ఒక బిడ్డను కనాలనుకున్నారు. కానీ, వారికి ఆ అవకాశం లేకపోవడంతో సరోగసి మార్గాన్ని ఎంచుకున్నారు. ఇంతమంది పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. ప్రపంచంలో అతిపెద్ద కుటుంబం తమదే అవుతుందని సంతోషంగా చెబుతున్నారు.