Mother punished son for love marriage
mictv telugu

దొంగపెళ్లి చేసుకొచ్చిన కొడుకు.. తాట తీసిన తల్లి… (వీడియో)

August 12, 2022

Mother punished son for love marriage

ప్రేమ పెళ్లిళ్లను అంగీకరించే పెద్ద మనసు మన పెద్దలకు లేదు. కొంతమంది దీనికి మినహాయింపు కావొచ్చు కానీ చాలామంది కట్టుబాట్లకే విలువ ఇస్తున్నారు. ప్రేమించి పెళ్లిచేసుకుంటే తలకాయలు తీసేస్తున్నారు. ఇక విషయంలోకి వస్తే ఓ తల్లి అంత దారుణానికి పాల్పడకపోయినా రచ్చ రంభోళా చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకుని, నవ వధువుతో ఇంటికొచ్చిన కొడుక్కి అక్షరాలా బడితెపూజ చేసింది. బంగ్లాదేశ్‌లో ఈ తతంగం జరిగినట్లు తెలుస్తోంది.

టీ తోటలున్న ప్రాంతానికి చెందిన ఓ కుర్రాడు పెళ్లి చేసుకుని నవ్వుకుంటూ ఇంటికొచ్చాడు. అతని తల్లి పిచ్చికోపంతో ఊగిపోయింది. కొడుకు మెడలోని పూలదండను తెంచేసింది. నానా బూతులు తిడుతూ గోలగోల చేసింది. కర్ర తీసుకొచ్చి కొట్టింది. అయితే పెళ్లికూతుర్ని మాత్రం ఏమీ అనలేదు. ఊరంతా అక్కడే జమైంది. తల్లి అంతగా తిడుతున్నాకుర్రాడు పళ్లు ఇకిలిస్తూ ఉన్నాడేగాని తిరగబడలేదు. ఇరుగుపొరుగువాళ్లు కొత్త జంటకు కూర్చోడానికి బెంచీ వేశారు. తర్వాత తల్లికూడా శాంతించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 

 

 

https://fb.watch/eS0-BN16–/