కొడుకును చంపేసి, తల్లిపై గ్యాంగ్‌రేప్.. - MicTv.in - Telugu News
mictv telugu

కొడుకును చంపేసి, తల్లిపై గ్యాంగ్‌రేప్..

October 12, 2020

Mother son incident in bihar.

హత్రాస్ సంఘటనను మరువక ముందే యూపీ పక్క రాష్ట్రం బీహార్‌లో మరో ఘోరం జరిగింది. ఐదేండ్ల కొడుకుతో బ్యాంకుకి వచ్చిన 35 ఏళ్ళ మహిళపై ఏడుగురు కామాంధులు అత్యాచారం చేశారు. ఈ ఘటనలో ఆ మహిళ కొడుకు మరణించాడు. బక్సర్ జిల్లాలోని చెయ్‌గైన్‌ లోని ఓ గ్రామానికి చెందిన మహిళ బ్యాంకులో నగదు డిపాజిట్ చేయడానికి తన తన కొడుకుతో మండల కేంద్రానికి వెళ్ళింది. ఆమెను ఏడుగురు కామాంధులు కిడ్నాప్ చేసి ఊరి చివరికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాలపడ్డారు.

అత్యాచారానికి అడ్డు వస్తున్న ఆమె కొడుకుపై దాడి చేశారు. తరువాత తల్లీబిడ్డలను తాడుతో కట్టేసి సమీపంలో కాలువలో పడేశారు. కాలువలో కొట్టుకపోతున్న తల్లీకొడుకులు చూసిన స్థానికులు వారిని బయటకి తీసి చెయ్‌గైన్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాలుడు అప్పటి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను సదార్ ఆస్పత్రికి పంపించారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. పోలీసులు నిందితుల్లో ఒకడైన మున్నీరామ్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.