నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నలను మూడు రోజులపాటు ఎదుర్కొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదుపరి దర్యాప్తును జూన్ 20కి వాయిదా వేయాలని కోరారు. మరోసారి ప్రశ్నించేందుకు శుక్రవారం హాజరుకావాలని ఆయనను ఈడీ అధికారులు బుధవారం ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో రేపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు రాలేనని రాహుల్ గాంధీ.. దర్యాప్తు సంస్థకు ఓ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం విచారణకు హాజరుకాలేనంటూ ఇవాళ ఓ లేఖ రాశారు. ప్రస్తుతం సోనియాగాంధీ కొడుకు, కూతురు రాహుల్, ప్రియాంక వాద్రాలు గంగారాం ఆస్పత్రిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. తన తల్లి బాగోగులు చూసుకునేందుకు అనుమతించాలని, విచారణను పొడిగించాలని లేఖలో రాహుల్ గాంధీ ఈడీని కోరారు.