మంచం విరగ్గొట్టిందని కూతురిపై  కోర్టుకెక్కిన తల్లి - MicTv.in - Telugu News
mictv telugu

మంచం విరగ్గొట్టిందని కూతురిపై  కోర్టుకెక్కిన తల్లి

October 26, 2019

Mother Takes her Daughter to Court She Broke Her Bed

టీవీ షోల్లో ప్రసారం అయ్యే కొన్ని ప్రైవేటు కోర్టు పంచాయితీలు అప్పుడప్పుడు నవ్వులు పూయిస్తూ ఉంటాయి. తీర్పు కోసం వారిని ఆశ్రయించే వారు చేసుకునే ఆరోపణలు ఆసక్తిగా ఉంటాయి. తాజాగా ఆస్ట్రేలియాలో జరిగిన ఓ ఘటన కూాడా అలాగే హస్యాన్ని పండించింది. ఇక్కడ ఇద్దరు తల్లి కూతుళ్లు మంచం కోసం ఒకరిపై ఒకరు ఆరోపించుకోవడం..చూసిన జడ్జితో సహా మిగిలిన వారంతా నవ్వు ఆపుకోలేకపోయారు. 

తల్లి కూతుళ్ల మధ్య పంచాయితీకి మంచం  కారణమైంది. తాను పడుకునే బెడ్ కూతురు విరగ్గొట్టిందని కోర్టుకు లాగింది ఓ తల్లి. వెంటనే ఆమె నుంచి తనకు పరిహారం ఇప్పించాలంటూ కోరింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ ఘటన అందరిని విస్మయానికి గురి చేసింది. ఈ సందర్భంగా తల్లి కూతుళ్లు ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు అందరిని నవ్వుల్లో ముంచేశాయి.  

నికోలే అనే మహిళ అక్కడి టీవీ షోలో వచ్చే.. ‘టైల్ బే కైల్’ కోర్టు షోకు తన కూతురు రిహియన్నన్‌పై ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా నికోలే.. తాను ఇంట్లో లేని సమయంలో కూతురు తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి శృంగారం చేస్తూ మంచం విరగొట్టిందని ఆరోపించింది. తర్వాత రిహియన్నన్ స్పందన జడ్జి కోరగా ఆమె చెప్పిన మాటలు ఇంకా దారుణంగా ఉన్నాయి. ఆ మంచం విరిగిపోయేంత బలహీనంగా మారడానికి తన తల్లి వాడిన విధానమే అంటూ చెప్పింది. ఇది విన్న జడ్జి నవ్వు ఆపుకోలేకపోయాడు.

రిహియన్నన్ చివరికి తన స్నేహితుడితో కలిసి గడపడం వల్లే ఆ మంచం విరిగిందని తేలింది. దీంతో జడ్జి స్పందిస్తూ…  ‘మీ తల్లి ఇంట్లో లేనప్పుడు అందులో ఉన్న సామాను బాధ్యత అంతా నీదే. నువ్వు ఏం చేశావనేది నీ వ్యక్తిగత ఇష్టం. నిన్ను నమ్మి ఇళ్లు అప్పగించినందుకు ఆమెకు నీవు పరిహారం కట్టాల్సిందే. ఇందుకుగానూ. జరిమానా కింద రూ.1,48,568  చెల్లించాలి’ అంటూ తీర్పు ఇచ్చారు. దీంతో ఈ వివాదం సద్ధుమణిగింది. అయితే తల్లి కూతుళ్లు చేసుకున్న ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.