ఫ్రెండే ఈ పోలీస్.. తల్లి పరీక్ష రాస్తుంటే బిడ్డను లాలించాడు… - MicTv.in - Telugu News
mictv telugu

ఫ్రెండే ఈ పోలీస్.. తల్లి పరీక్ష రాస్తుంటే బిడ్డను లాలించాడు…

October 1, 2018

అప్పడప్పుడు కొన్ని సంఘటనలు చూస్తే ఆశ్చర్యం కలిగుతుంది. ఫ్రెండ్లీ పోలీస్ అంటూ ఈమధ్య పోలీసులు జనాల పట్ల స్నేహభావంతో మెలుగుతున్నారు. అలాంటి సంఘటనే మహబూబ్‌నగర్‌లోని మూసాపేటలో చోటుచేసుకుంది. ఆదివారం జరిగిన తెలంగాణ కానిస్టేబుల్ పరీక్ష కేంద్రానికి ఓ మహిళ తన చిన్నారితో  వచ్చింది. ఆమె పరీక్ష రాస్తుండగా కానిస్టేబుల్ ముజిదార్ రెహ్మాన్ చిన్నారిని ఎత్తుకుని లాలించాడు, ఆడించాడు, సముదాయించాడు. ఈ దృశ్యాన్ని ఫోటోలో బంధించిన ఐపీఎస్ అధికారి రెమా రాజేశ్వరి ట్విటర్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఈ పోలీస్ ఫ్రెండే అంటున్నారు యూజర్లు.Mother Writting Exam.. The constable who sees the babyమూసాపేటకు చెందిన పీజీ చేసిన ఓ  మహిళ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. ఆదివారం పరీక్ష కేంద్రానికి తన పసిబిడ్డతో వచ్చింది. ఆమె పరీక్ష రాస్తున్న సమయంలో తన బిడ్డకు చూసుకునేందుకు తనవెంట ఓ 14ఏళ్ల అమ్మాయి వచ్చింది. ఆ బాలికకు తన బిడ్డను అప్పగించి, లోపలికి పరీక్ష రాయడానికి వెళ్లింది. ఆ తర్వాత కొద్ది సమయానికి పాప ఏడ్వటం ప్రారంభించింది. దీంతో పాపను ఎత్తుకుని కానిస్టేబుల్ ముజిదార్ సముదాయించే ప్రయత్నం చేశాడు. తల్లి పరీక్ష రాసినంత సేపు ఆ బిడ్డ ఏడవకుండా చూసుకున్నాడు.

ఆ సమయంలో తీసిన ఫోటోను ఐపీఎస్ అధికారి ట్విటర్‌లో పెట్టింది. దీంతో ముజిదార్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  తాను ప్రజలకు సేవ చేయడానికే వచ్చానని, ప్రజలకంటే తనకు ఏదీ ముఖ్యం కాదని తెలిపాడు. ముజుదార్‌కు ఇద్దరు పిల్లలు . కొడుకు చైనాలో మెడిసన్ చదువుండగా, కుమార్తె పదోతరగతి చదువుతోంది.