Mother's authority to decide child's surname: Supreme Court
mictv telugu

అలాంటి పిల్లల ఇంటిపేరు నిర్ణయించే అధికారం తల్లిదే : సుప్రీంకోర్టు

July 29, 2022

తండ్రి చనిపోయిన పిల్లల ఇంటిపేరు విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. తండ్రి మరణానంతరం బిడ్డకు సహజ సంరక్షకురాలు తల్లే కాబట్టి ఆ బిడ్డ ఇంటి పేరు నిర్ణయించే అధికారం తల్లిదేనని స్పష్టం చేసింది. భర్త చనిపోయిన తర్వాత మహిళ రెండో పెళ్లి చేసుకుంటే పిల్లల సర్టిఫికెట్లలో రెండో భర్తను సవతి తండ్రిగా పేర్కొనాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. రికార్డుల్లో రెండో భర్తను సవతి తండ్రిగా పేర్కొనడం క్రూరమైనది, అనాలోచితమైనదిగా అభిప్రాయపడింది. ఇలా చేయడం వల్ల మానసికంగా పిల్లలపై చెడు ప్రభావం చూపుతుందనీ, వారి ఆత్మగౌరవానికి కూడా ఇది భంగం కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. అలాగే దత్తత ఇచ్చే విషయంలో కూడా తల్లికే పూర్తి హక్కు ఉందని, ఇలాంటి కేసుల్లో ముందుగా పిల్లల ప్రయోజనాలే ముఖ్యమని ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు జస్టిస్ దినేశ్ మహేశ్వరి, కృష్ణ మురారిలతో కూడిన బెంచ్ ఆదేశాలిచ్చింది.