థ్యాంక్యూ మామ్ బదులు.. ఇలా శుభాకాంక్షలు చెప్పొచ్చుగా..  - MicTv.in - Telugu News
mictv telugu

థ్యాంక్యూ మామ్ బదులు.. ఇలా శుభాకాంక్షలు చెప్పొచ్చుగా.. 

May 8, 2020

 

mothers day quotations celebrate with mother .jp

సృష్టికి మూలం అమ్మ. ప్రతిజాతి మనుగడకు ఆధారం మాతృమూర్తి. రక్తమంసాలు పంచి ఇవ్వడం నుంచి పాలిచ్చి పెంచి, పెద్ద చేసి, విద్యాబుద్ధులు నేర్పుంది ఆ త్యాగశీలి. తల్లికోడి తన పిల్లలను రెక్కల కింద దాచుకున్నట్లు కాపాడుకుంటుంది అమ్మ. ఆమె ప్రేమకు, అనురాగానికి, త్యాగానికి వెలకట్టే కుబేరుడు ఈ లోకంలో లేడు. అందుకే మదర్స్ డే అంటూ ఆమెను గుర్తుచేసుకుంటుందీ ప్రపంచం. అమ్మకు ప్రత్యేకంగా రోజేంటి? ఆమె పుణ్యంతోనే కదా రోజూ ఊపిరి పీలుస్తాన్నాం అనుకునే మనసున్న బిడ్డలు కూడా ఉన్నారు. కానీ అమ్మకు ఆమె విశిష్టతను గుర్తుచేసి, శిరసు వచ్చి శుభాకాంక్షలు చెబితే ఆమె మరింత ప్రేమను కురిపిస్తుంది కదా. మరి ఈ నెల 10న మదర్స్ డే సందర్బంగా మీకు నచ్చిన ఈ కొటేషన్లతో మదర్స్ డే శుభాకాంక్షలు చెబుతారు కదూ.. !

 

నాకు ప్రాణం పోసి, ఈ రూపాన్నిచ్చి.. మనిషిగా తీర్చిదిద్దినందుకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? వచ్చే జన్మంటూ ఉంటే మళ్లీ నీ కడుపునే పుడతానమ్మా.. హ్యాపీ మదర్స్ డే

 

పుట్టగానే తొలుత చూసింది నిన్నే. ఆడుకున్నది కూడా నీతోనే. నీ ప్రేమ ఇలాగే నన్ను కాపాడుతూ ఉండాలి.. అమ్మకు జేజేలు. హ్యాపీ మదర్స్ డే. 

 

అమ్మ ఆరాటమంతా మన ఆనందం కోసమే. మన ఆనందంలో ఆమె తన ఆనందాన్న చూసుకుంటుంది… హ్యాపీ మదర్స్ డే 

 

అమ్మ గోరు ముద్దలో తన ప్రేమ కూడా కలిపి పెడుతుంది. కడుపు నిండిందో లేదోనని కలవరపడుతుంది. బిడ్డ నవ్వితే చాలు తన కడుపునిండినట్లు మురిసిపోతుంది.. హ్యాపీ మదర్స్ డే

 

కనిపించని దేవుడైనా.. కనిపెంచిన నీ తర్వాతే అమ్మా!.. హ్యాపీ మదర్స్ డే 

 

అమ్మ ప్రేమ భాషకు అందదు. ఆమె పాదాభివందనాలు.. మాతృదినోత్సవ శుభాకాంక్షలు

 

అమ్మ లేకపోతే జీవం లేదు, జననం లేదు. గమనం లేదు. అసలు ఈ ప్రపంచమేలేదు.. మాతృదినోత్సవ శుభాకాంక్షలు


సృష్టిలో ఏ స్వార్థం లేకుండా పనిచేసుకుపోయేది అమ్మ మాత్రమే. బిడ్డల కోసం ప్రాణాలను సైతం ధారపోసే త్యాగమూర్తి ఆమె మాత్రమే.. హ్యపీ మదర్స్ డే

 

అమ్మను నువ్వు వద్దనుకోవచ్చు. కానీ ఆమె తన ప్రాణం ఉన్నంతవరకు నీ వెన్నంటే ఉంటుంది.. హ్యపీ మదర్స్ డే

సృష్టిలో అందమైనది పువ్వు.. నా దృష్టిలో అందమైనది మా అమ్మ నవ్వు… హ్యాపీ మదర్స్ డే


అమ్మంటే అమూల్య నిధి. ఆమె మనసే అమృతం. ఆమెను గుర్తించు గౌరవించు.. హ్యపీ మదర్స్ డే

అమ్మ కడుపు చూస్తుంది, పెళ్లాం జేబు చూస్తుంది. అందుకే జేబు ఖాళీ చేసి అమ్మకు కానుక ఇద్దాం.. హ్యాపీ మదర్స్ డే 

 

అమితమైన ప్రేమ అమ్మ. అంతులేని అనురాగం అమ్మ. అలుపెరుగని ఓర్పు, ఓదార్పు అమ్మ. అద్భుత స్నేహం అమ్మ. అపురూపమైన కావ్యం అమ్మ, అరుదైన రూపం అమ్మ.. హ్యాపీ మదర్స్ డే


బిడ్డను స్వచ్ఛంగా ప్రేమించేంది అమ్మే. బిడ్డ ప్రేమలో కల్మశం ఉండొచ్చేమోగాని తల్లి ప్రేమలో కల్తీ ఉండదు.. హ్యాపీ మదర్స్ డే

 

అమ్మ కొంతకాలం మాత్రమే పిల్లలను చేత్తో పట్టుకుంటుంది. కానీ ఆమె హృదయం ఎప్పుడూ వారిని పట్టుకునే ఉంటుంది.. హ్యాపీ మదర్స్ డే

పదాలు తెలియని పెదవులకు అమృత వచనం అమ్మ. ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ.. మహిళగా నీ త్యాగం ఎప్పటికీ మరవలేమమ్మా.. హ్యాపీ మదర్స్ డే.

అమ్మ చేసే ప్రతి పని మన ఆనందం కోసమే.. మన ఆనందంలో తన ఆనందాన్ని చూసుకుంటుంది.

 

అమ్మలు మాత్రమే బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. వాళ్లకు జన్మనిచ్చింది వాళ్లే కాబట్టి.. హ్యాపీ మదర్స్ డే