ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటో కొత్త ఫోన్ తీసుకుని రావడానికి సన్నాహాలు చేస్తోంది. మోటో ఈ7 పేరుతో వస్తున్నా ఈ ఫోన్ ధర రూ. 10వేల లోపే ఉంటుందని సమాచారం. ఈ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. ఈ ఫోన్ XT2095-3 అనే మోడల్ నంబర్‌తో కనిపించింది. టీయూవీ సర్టిఫికేషన్ ప్రకారం ఇందులో ఈ ఫోన్‌తో 4000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. ఈ ఫోన్ 5W చార్జింగ్కు సపోర్ట్ చేయనుందని తెలుస్తోంది. వైఫై, ఎల్టీఈ, జీపీఎస్, బ్లూటూత్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్‌ను కూడా ఇందులో అందించనున్నారు. ఈ ఫోన్ వెనకభాగంలో ఫింగర్ ప్రింట్ అందించారు.
మోటో ఈ7 ఫీచర్లు
* 6.2 అంగుళాల హెచ్డీ+ డిస్ ప్లే,
* 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్,
* 13+2 మెగా పిక్సెల్ రేర్ డ్యూయల్ కెమెరా సెటప్,
* 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా,
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ,
* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం.