బడ్జెట్ ధరకే మోటో కొత్త ఫోన్ - MicTv.in - Telugu News
mictv telugu

బడ్జెట్ ధరకే మోటో కొత్త ఫోన్

October 25, 2019

Moto  .

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా జి సిరీస్‌లో భాగంగా కొత్త ఫోన్‌ను శుక్రవారం విడుదల చేసింది. బడ్జెట్‌ ధరలో జీ8 ప్లస్‌ను తీసుకొచ్చింది. కాస్మిక్‌ బ్లూ, క్రిస్టల్‌ పింక్‌ రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది. అక్టోబర్‌ 29 నుంచి ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌‌లో లభ్యం కానుంది. ఈ ఫోన్ కొనుగోలుపై జియో ఆఫర్ ‌లభించనుంది. ఈ ఫోన్ తీసుకున్న జియో వినియోగదారులకు 2200 తక్షణ క్యాష్‌బ్యాక్‌ సదుపాయంతో పాటు రూ.3వేల క్లియర్‌ ట్రిప్‌ కూపన్‌, రూ.2వేల జూమ్‌ కార్‌ వోచర్‌ లభిస్తాయి. ఈ ఫోన్ ధరను రూ.13,999 గా నిర్ణయించింది.

 

మోటో జీ 8 ప్లస్‌ ఫీచర్లు

 

* 6.3 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ ప్లే,

* ఆండ్రాయిడ్‌ 9పై ఆపరేటింగ్ సిస్టం,

* క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌,

* 4 జీబీ ర్యామ్‌, 

* 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌,

* 25 ఎంపీ సెల్ఫీ కెమెరా,

* 48+16+5 ఎంపీ అల్ట్రా వైడ్‌ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా,

* 4000 ఎంఏహెచ్‌,

* వాటర్‌  రిపెల్లెంట్‌ డిజైన్‌, 

* డాల్బీ  స్టీరియో స్పీకర్స్‌, 

* ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌.