మోటరోలా ఫోల్డబుల్‌ ఫోన్‌.. అంచనాలను పెంచేస్తోంది.. - MicTv.in - Telugu News
mictv telugu

మోటరోలా ఫోల్డబుల్‌ ఫోన్‌.. అంచనాలను పెంచేస్తోంది..

November 14, 2019

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా త్వరలో ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఇప్పటికే శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ పేరుతో మడతపెట్టే ఫోన్‌ను విడుదల చేసిన సంగతి తెల్సిందే. దీంతో మోటోరోలా అత్యుత్తమ ఫీచర్స్‌తో ఫోల్డబుల్‌ డిస్‌ప్లేతో తన పాపులర్‌ మోడల్‌ ‘మోటరోలా రేజర్’ను తీసుకురాబోతోంది. మోటరోలా రేజర్ 2019 పేరుతో అదీ ఫ్లిప్‌ తరహాలోనే ఆవిష్కరించనుంది. మోటరోలా మీడియా ఆహ్వానంలో ఈ సంకేతాలను అందించింది. శాంసంగ్‌, హువావే ఫోన్లకంటే భిన్నంగా దీన్ని తీసుకొరానుంది. ఈ ఫోన్ ధర విషయానికి వస్తే సుమారు రూ. 1,18,500 ఉండనుందని సమాచారం.

Moto Razr.

మోటరోలా రాజర్ 2019 ఫీచర్లపై అంచనాలు

 

* 6.2 అంగుళాల డిస్‌ప్లే, 

* 876×2142 పిక్సెల్స్ రిజల్యూషన్‌,

* కవర్ డిస్‌ప్లే 600×800 పిక్సెల్స్ రిజల్యూషన్,

* క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 710 సాక్‌,

* 6 జీబీ ర్యామ్/ 128జీబీ స్టోరేజ్,

* 2730 ఎంఏహెచ్ బ్యాటరీ.