ప్రముఖ మొబైల్స్ తయారీ కంపెనీ మోటొరోలా ఇండియాలో అద్భుతమైన ఫోన్స్ పరిచయం చేయబోతుంది. ప్రపంచంలో తొలి 200 మెగాపిక్సెల్ కెమెరాతో మోటో ఎక్స్ 30 ప్రో స్మార్ట్ ఫోన్‌ను ఆగష్టు 2 న తొలుత చైనాలో, ఆ తర్వాత ఇండియాలో లాంచ్ చేయనుంది. క్వాల్కామ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ మొబైల్ రన్ అవుతుంది. గరిష్ఠంగా 12జీబీ LPDDR5 ర్యామ్‌తో రానుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో లాంచ్ కానుంది.
125 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా Moto X30 Pro ఫోన్‌కు మరో ప్రత్యేకతగా ఉంది. 6.73 ఇంచుల pOLED డిస్ప్లేతో ఈ మొబైల్ రానుందని సమాచారం. 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కోసం పంచ్ హోల్ కటౌట్ ఉంటుందని ఈ మొబైల్ ఫొటో ద్వారా తెలుస్తోంది. స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ఈ మొబైల్లో ఉంటుంది. 12జీబీ వరకు LPDDR5 ర్యామ్‌తో రానుంది. Moto X30 Pro వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. 200 మెగాపిక్సెల్ కెమెరాతోపాటు 50 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ కెమెరాల ఉండనున్నాయి. 85 ఎంఎం, 50 ఎంఎం, 35 ఎంఎం లెన్స్, సెన్సర్ల సాయంతో క్లోజప్, పోర్ట్రయిట్, వైడ్ యాంగిల్ ఫొటోలు తీసుకునే సదుపాయం ఉండనుంది.
ఆండ్రాయిడ్ 12 బేస్డ్ MyUI 4.0 ఓఎస్‌పై Moto X30 Pro రన్ అవుతుంది. 4,500mAh బ్యాటరీ ఈ మొబైల్లో ఉంటుందని సమాచారం. 125W GaN ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజీ మెమరీతో ఒక మోడల్, 12 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజీతో మరో మోడల్ అందుబాటులో ఉండనున్నాయి. 12 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజీ మోడల్ ధర సుమారు రూ.59,990 ఉంటుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిలీజ్ రోజున మోటో సంస్థ ధరను ప్రకటించే అవకాశం ఉంది.