Motor Vehicle Inspector Notification suspended by High Court
mictv telugu

ఉద్యోగ నోటిఫికేషన్ సస్పెండ్ చేసిన హైకోర్టు

November 21, 2022

ఏపీపీఎస్పీ విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ ను హైకోర్టు సోమవారం సస్పెండ్ చేసింది. సహాయ మోటార్ వాహన ఇన్ స్పెక్టర్ నోటిఫికేన్ తాత్కాలికంగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నోటిఫికేషన్ లో భాగంగా నిర్వహించే రాత పరీక్ష ప్రశ్నాపత్రం కేవలం ఆంగ్లంలో మాత్రమే ఇవ్వడంపై తూర్పుగోదావరి జిల్లా వాసి కాశీ ప్రసన్నకుమార్ హైకోర్టులు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా క్వశ్చన్ పేపర్ ఇవ్వడాన్ని ప్రస్తావించారు. నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. విచారించిన కోర్టు.. పిటిషన్ వాదనతో ఏకీభవిస్తూ నోటిఫికేషన్ ను సస్పెండ్ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది.