ఒక బైక్‌పై 58 మంది చలోచలో... - MicTv.in - Telugu News
mictv telugu

ఒక బైక్‌పై 58 మంది చలోచలో…

November 20, 2017

మోటార్ బైక్‌పై ముగ్గురు కూర్చుకోవాలంటేనే ఇబ్బంది పడతాం.. ఇక 10 మంది, 20 మంది.. కూర్చుంటే ఎలా ఉంటుంది. అసాధ్యం అని అంటున్నారా? అయితే భారత ఆర్మీ దీన్ని సుసాధ్యం చేసింది. ఒక బైక్‌పై ఏకంగా 58 ఎక్కి తుర్రుమన్నారు.

టోర్నడోస్ అనే టీం ఈ రికార్డు సాధించింది. 500 సీసీ సామర్థ్యమున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ మీద 58 మంది ఎక్కి 1200 మీట‌ర్ల దూరం ప్ర‌యాణించారు. ఇది ప్రపంచ రికార్డుగా గిన్నిస్ బుక్కులోకి ఎక్కింది. జాతీయ ప‌తాక రంగుల్లో టోపీలు ధ‌రించి బెంగళూరులోని ఎల‌హంక ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్‌లో టోర్న‌డోస్ బృందం ఈ విన్యాసం చేశారు.  2013లో భార‌త ఆర్మీకే చెందిన డేర్ డెవిల్స్ బృందం 56 మందితో ఇలాంటి రికార్డు నెలకొల్పింది.