Motorists: No more toll plazas.. based on number plate
mictv telugu

వాహనదారుల్లారా: ఇకపై టోల్ ప్లాజాలు ఉండవు..నంబర్ ప్లేట్ ఆధారంగానే

August 24, 2022

దేశ‌వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో, జిల్లాలో, మండ‌లాల్లో, గ్రామాల్లో ఫోర్ విల్ల‌ర్ వాహనాలను క‌ల్గి ఉన్న వారికి కేంద్ర రహదారుల శాఖ‌ మంత్రి నితిన్ గడ్కరీ ఓ సంచ‌ల‌న విషయాన్ని వెల్లడించారు. ఇక‌పై టోల్ ప్లాజాలు ఉండవని, వాహ‌నానికి ఉన్న‌ నంబర్ ప్లేట్ ఆధారంగానే బ్యాంకు ఖాతా నుంచి ఛార్జీలు వసూలు చేస్తామ‌ని పేర్కొన్నారు.

నితిన్ గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ..టోల్ ప్లాజాలు లేకపోతే టోల్ చార్జీలు ఎలా వసూలు చేస్తారనే సందేహం మీకూ రావొచ్చు. నంబర్ ప్లేట్ ను రీడ్ చేసే కెమెరాలు ఉంటాయి. వాటి ఆధారంగానే వాహనదారుల బ్యాంకు ఖాతా నుంచి ఛార్జీల‌ను వసూలు చేస్తాం. ప్రయోగాత్మకంగా దీన్ని పరీక్షించే ప్రక్రియ ప్ర‌స్తుతం కొనసాగుతుంది. ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు చట్టపరమైన చర్యలు కూడా ప్రారంభించాం. ఫాస్టాగ్ విధానంలో కార్లపై ప్ర‌స్తుతం ఆర్ఎఫ్డీ ట్యాగ్ స్టిక్కర్ వేస్తున్నాం. నంబర్ ప్లేట్లు రీడ్ చేసే విధానంలో వీటి అవసరం ఉండదు. కంపెనీ ఫిట్ చేసిన నంబర్ ప్లేట్లతోనే కార్లు రోడ్లపైకి రావాలని 2019లోనే నిబంధనలు తెచ్చాం అని ఆయ‌న అన్నారు.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం టోల్ ఛార్జీల్లో 97 శాతం అంటే సుమారు రూ.40,000 కోట్లు ఫాస్టాగ్ ల ద్వారా వసూలు అవుతున్నాయని, గత నాలుగేళ్లలో రోడ్లపైకి వచ్చిన కార్ల నంబర్ ప్లేట్లు భిన్నంగా ఉంటున్నాయని, కార్లకు ఈ తరహా నంబర్ ప్లేట్లు లేకపోతే నిర్ణీత సమయంలోగా వాటిని అమర్చుకునే విధంగా నిబంధనలు కూడా తీసుకొస్తున్నామ‌ని అని ఆయ‌న పేర్కొన్నారు.

ఫాస్టాగ్ విషయానికొస్తే..దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం కారు అద్దం లోపలి భాగంలో ఒక స్టిక్కర్ రూపంలో అతికిస్తారు. వాహనాలకు సంబంధించిన అన్ని రిజిస్ట్రేషన్ వివరాలనూ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ బార్‌కోడ్ రూపంలో ఫాస్టాగ్‌లో పొందుపరుస్తారు. ఫాస్టాగ్ తీసుకున్న రోజు నుంచి 5 సంవత్సరాల వరకు ఇది చెల్లుబాటు అవుతుంది.