మోటో ఎడ్జ్ ప్లస్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

మోటో ఎడ్జ్ ప్లస్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

May 16, 2020

nmotii

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా మరో ఫోన్‌ను భారత్‌లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. సరికొత్త ఫీచర్స్‌తో దీన్ని ఈ నెల 19న అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. మోటో ఎడ్జ్ ప్లస్‌ పేరుతో దీన్ని మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. దీని ధర రూ. 75,300గా ఉండనున్నట్టు తెలిపారు. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మే 19 న మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉండనున్నట్టు తెలిపారు. 

 

ఫీచర్స్ ఇవే : 

 

  1. స్క్రీన్ : 6.7 అంగుళాల
  2. ప్రాసెసర్ :  స్నాప్‌డ్రాగన్ 865 
  3. ర్యామ్ : 12 జీబీ 
  4. స్టోరేజీ : 256 జీబీ ఇ
  5. ప్రైమరీ కెమెరా : 108 ఎంపీ,16,18
  6.  సెల్ఫీ కెమెరా : 25.
  7. బ్యాటరీ : 5000 ఎంఏహెచ్