సేల్‌కి వెళ్లిన 20 సెకండ్లలోనే ‘మోటో జీ8 పవర్ లైట్’ ఔటాఫ్ స్టాక్ - Telugu News - Mic tv
mictv telugu

సేల్‌కి వెళ్లిన 20 సెకండ్లలోనే ‘మోటో జీ8 పవర్ లైట్’ ఔటాఫ్ స్టాక్

May 29, 2020

 

Motorola

మోటొరోలా కంపెనీ తాజాగా లాంచ్ చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మోటో జీ8 పవర్ లైట్ సేల్ ఈరోజు మొదటి సేల్ కి వెళ్లిన సంగతి తెల్సిందే. ఈరోజు సేల్ కి వెళ్లిన 20 సెకండ్లలోనే అవుట్ అవుట్ స్టాక్ లోకి వెళ్ళిపోవడం గమనార్హం. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు కేవలం ఫ్లిప్ కార్ట్ లో మొదటి సేల్ జరిగింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్, మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. 4జీబీ+64జీబీ వేరియంట్‌లో మాత్రమే ఈ ఫోన్ విడుదలైంది. దీని ధరను రూ.8,999గా నిర్ణయించింది. ఈ ఫోన్ ఆర్కిటిక్ బ్లూ , రాయల్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉన్నది.

 

మోటో జీ8 పవర్ లైట్ ఫీచర్లు

 

* 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్ప్లే,

* 4జీబీ ర్యామ్,

* 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,

* మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్,

* 16+2+2 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా,

* 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,

* 5,000ఎంఏహెచ్ బ్యాటరీ.

* ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్.