మోటరోలా ఫోల్డబుల్‌ ఫోన్‌..రేపే మొదటి సేల్ - MicTv.in - Telugu News
mictv telugu

మోటరోలా ఫోల్డబుల్‌ ఫోన్‌..రేపే మొదటి సేల్

March 15, 2020

MOTOROLA RAZR TO BE LAUNCHED IN INDIA TOMORROW

మొబైల్ సాంకేతికత రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. మొబైల్ తయారీ సంస్థలు ప్రస్తుతం ఫోల్డబుల్ ఫోన్లపై దృష్టి సారించాయి. ఇప్పటికే శాంసంగ్ కంపెనీ గాలక్సీ ఫోల్డ్ పేరుతో ఓ మడతబెట్టే ఫోన్‌ను విడుదల చేసిన సంగతి తెల్సిందే. మోటొరోలా కూడా ‘మోటో రేజర్’ పేరుతో ఫ్లిప్ స్మార్ట్ ఫోన్‌ను గతేడాది అమెరికాలో లాంచ్ చేసింది. మార్చ్ 16న ఈ ఫోన్ భారత్‌లో విడుదల కానుంది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో 

ఈ ఫోన్ సేల్ జరుగనుంది. ఈ ఫోన్ ధర విషయానికి వస్తే సుమారు రూ. 1,18,500 ఉండనుందని సమాచారం.

మోటరోలా రాజర్ 2019 ఫీచర్లు

 

* 6.2 అంగుళాల డిస్‌ప్లే, 

 

* 876×2142 పిక్సెల్స్ రిజల్యూషన్‌,

 

* కవర్ డిస్‌ప్లే 600×800 పిక్సెల్స్ రిజల్యూషన్,

 

* క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 710 సాక్‌,

 

* 6 జీబీ ర్యామ్/ 128జీబీ స్టోరేజ్,

 

* ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టం,

 

* 2510 ఎంఏహెచ్ బ్యాటరీ.