విజయవాడలో విరిగిన కొండలు.. ఒకరి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

విజయవాడలో విరిగిన కొండలు.. ఒకరి మృతి

October 13, 2020

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. విజయవాడలో కురిసిన భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఈరోజు నగరంలోని విద్యాధరపురంలోని నాలుగు స్తంభాల దగ్గర ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి మట్టిలో ఇరుక్కు పోయాడు. ఈ సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు మొదలెట్టారు.

మట్టి పెళ్లలను తొలగించి ఆ వ్యక్తిని అంబులెన్స్‌లో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతడు మరణించాడని వైద్యులు తెలిపారు. అలాగే కుమ్మరిపాలెంలో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. అక్కడ ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దుర్గగుడి ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటన జరిగిన సమయంలో ఘాట్ రోడ్డులో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో టోల్‌గేట్‌ నుంచి వచ్చే వాహనాలు నిలిపివేశారు. అధికారులు వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. రోడ్డుపై పడిన రాళ్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.