రష్యా నేలపై తెరుచుకుంటున్న నరకలోకం నోళ్లు.. టెన్షన్ టెన్షన్ - MicTv.in - Telugu News
mictv telugu

రష్యా నేలపై తెరుచుకుంటున్న నరకలోకం నోళ్లు.. టెన్షన్ టెన్షన్

June 21, 2022

ఈ ఫొటోలుచూశారా? దట్టమైన అటవీ ప్రాంతంలో భూమిని చీల్చుతున్నట్లు కనబడుతున్న ఓ పెద్ద లోయ ఇది. రష్యాలోని సైబీరియా మంచు ఎడారిలో యాకుటియా ప్రాంతంలో ఉంది. దగ్గర్లోని గ్రామం పేరు బటాగే కావడం వల్ల..దీనిని బటాగే గ్యాప్ అని పిలుస్తారు. స్థానికులు దీన్ని ‘నరక ద్వారం’ అని పిలుస్తుంటారు. ఈ గొయ్యిలోంచి వెళ్తే పాతాళ లోకానికి చేరతామని చెబుతుంటారు. కొన్ని శక్తుల కోపానికి గురికావడం వల్ల ఈ లోయ ఏర్పడిందని, ఈ ప్రాంతంలో సంచరించడం నిషేధమని హెచ్చరిస్తుటారు.

శాస్త్రవేత్తలు ఈ లోయ మిస్టరీని ఇంతవరకు చేధించలేపోయారు. దీని లోతు, విస్తీర్ణమెంతో కూడా చెప్పలేకపోయారు. విపరీతంగా చెట్లను నరికరేయడం. మంచు పొర వల్ల కరిగిపోవడం వల్ల ఇది ఏర్పడిందని అంచనా. ఉష్ణోగ్రతలు ఎక్కువ కావడంతో మంచు కరిగి భూమి రోజు రోజుకూ కుంగిపోయి బిలంలా మారి ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో… రష్యా దారుణాలకు తెగబడుతుందని, ఈ కారణంగానే లోయ పరిమాణం పెరుగుతోందని కొందరి నమ్మకం. యుద్ధం ఆపకపోతే అంతకంటే ఎక్కువ ఘోరాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.