నోటి దుర్వాసనను ఇలా పోగొట్టుకోండి - MicTv.in - Telugu News
mictv telugu

నోటి దుర్వాసనను ఇలా పోగొట్టుకోండి

October 28, 2017

చాలామందికి ఇబ్బంది పెట్టే సమస్య నోటి దుర్వాసన. దాని కారణంగా నలుగురిలో మాట్లాడాలంటే భయపడుతుంటారు. రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకున్నా కూడా కొందరికి, నోటి దుర్వాసన సమస్య తీవ్రంగా ఉంటుంది.

చాలామంది రకరకాల మౌత్ వాష్‌లు వాడుతుంటారు. మార్కెట్లో దొరికే మౌత్ వాష్‌లను వాడే బదులు, మనమే తక్కువ ఖర్చుతో ఎలాంటి రసాయనాలు లేకుండా వాటిని తయారు చేసుకోవచ్చు. అర స్పూన్ వంట సోడాను,అర కప్పు నీటిలో కలిపి మౌత్‌వాష్‌గా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. బేకింగ్ సోడాను నీటిలో బాగా కలిపి పుక్కిలించి ఉమ్మేయాలి. ఇది నోటి దుర్వాసనను చాలా వరకు అరికడుతుంది. కాబట్టి ఈ చిట్కాను ఉపయోగించి, ఇంట్లోనే మౌత్‌వాష్ ను తయారు చేసుకోండి, నోటి దుర్వాసన నుంచి విముక్తి పొందండి.