ప్రముఖ చౌరస్తాకు సుశాంత్ పేరు.. ​ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రముఖ చౌరస్తాకు సుశాంత్ పేరు.. ​

July 10, 2020

Purnea chowk.

బాలీవుడ్​ స్టార్ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఆత్మహత్యను ఇంకా ఆయన అభిమానులు మరిచిపోలేకపోతున్నారు. సుశాంత్ స్వస్థలం అయిన పూర్ణియా జిల్లా వాసులు.. అత‌డికి ఘ‌న‌ నివాళి అర్పించారు.  పూర్ణియా సిటీలోని చారిత్రాత్మక ఫోర్డ్​ కంపెనీ జంక్షన్​కు ‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చౌక్’ అని నామకరణం చేశారు. అలాగే మధుబని నుంచి మాతా ఏరియాని అనుసంధానం చేసే మూడు కిలోమీటర్ల దారికి కూడా ‘సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మార్గం’ అని పిలవనున్నారు. 

ఈ విషయమై జిల్లా మేయర్​ సవితా దేవి మాట్లాడుతూ.. ‘మున్సిపల్​ కార్పోరేషన్​ల వాయిస్​ ఓటింగ్​ పద్దతిలో ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. సుశాంత్​ పూర్వీకుల గ్రామం పూర్ణియా. సుశాంత్ చనిపోయాక అతడి కోసం ఓ స్థూపాన్ని కూడా ఏర్పాటు చేయాల‌ని ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు’ అని వెల్లడించారు. ‘ఇది సుశాంత్​కు నివాళి మాత్రమే కాదు..  రాష్ట్రానికే గర్వకారణం’ అని సుశాంత్​ బాల్య స్నేహితుడు, బిహార్​ వికాస్​ మోర్చా అధ్యక్షుడు రాకేశ్​ సింగ్ తెలిపారు.