Movement of tigers
mictv telugu

నడిరోడ్డుపై పులుల సంచారం.. మొత్తం నాలుగు

November 13, 2022

ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం కలకలం రేపుతోంది. భీంపూర్ మండలం తాంసి-కే శివారులోని పిప్పల్‌ కోటి రిజర్వాయర్ వద్ద పనులు జరుగుతున్న ప్రదేశంలో నాలుగు పులులు కనిపించాయి. డీజిల్ కోసం వెళ్లిన డ్రైవర్.. పులులు రోడ్డు దాటుతున్న దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే కొరాట, గూడా, రాంపూర్, తాంసీ, గొల్లఘాట్ ప్రాంతాల్లోని రైతులు పులుల భయంతో పంట పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు.

ఇటీవల జైనథ్ మండలం గూడ గ్రామం శివారులోని చనకాకొరట కెనాల్‌లో కనిపించిన రెండు పులులు.. తాజాగా కనిపించిన వాటిలో ఉన్నాయని అటవీ అధికారులు ధ్రువీకరించారు. కనిపించిన వాటిలో ఒక పులి ఉండగా, మిగతా మూడు ఏడాది వయస్సులోపు ఉన్న పిల్లలుగా భావిస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దు తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చిన పులి దాని పిల్లలు అవాసం ఏర్పర్చుకునే క్రమంలో నెల రోజులుగా తాంసి కే అటవీ శివారులో మకాం వేసినట్లుగా అనుమానిస్తున్నారు. మరోవైపు అటవీ అధికారులు బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి 4 రోజుల నుండి పులుల కోసం గాలిస్తున్నారు.