Movie actress who gave birth to twins.. Here is the video
mictv telugu

కవల పిల్లలకు జన్మనిచ్చిన సినీ నటి..వీడియో ఇదిగో

August 20, 2022

తెలుగు ఇండస్ట్రీలో అందంతో, నటనతో, డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికి చేరిగిపోలేని ముద్ర వేసుకున్న టాప్ హీరోయిన్స్‌లో ఒకరు నటి నమిత. ఆమె ‘సొంతం’, ‘జెమిని’, ‘సింహా’ వంటి సినిమాల్లో నటించి, తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. 2017 నవంబర్‌లో నమిత.. నటుడు, వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో తన దాంపత్య జీవితంలో జరిగిన ప్రతి ఆనంద విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులకు తెలియజేసింది. తాజాగా మరో ఆనంద విషయాన్ని ఆమె ఓ వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు.

నమిత పండంటి కవలలకు జన్మినిచ్చారు. చెన్నై సమీపంలోని క్రోమ్‌పేటలో ఉన్న రేలా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో తమకు ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చారని, భర్తతో కలిసి కవలలను ఎత్తుకొని వీడియోలో మాట్లాడుతూ.. ”శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. అభిమానుల ఆశీస్సులు, ఆశీర్వాదాలు ఎల్లప్పుడు మాకు ఉంటాయి. ఇకపైనా అవి కొనసాగాలని కోరుకుంటున్నా. ఆసుపత్రి యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు. శిశువులు, నేను ఆరోగ్యంగా ఉన్నాం” అని ఆమె అన్నారు.